వ్యక్తి హత్య: భార్యతో పాటు ఆమె ప్రియుడి అరెస్టు

Woman, lover arrested for murdering husband
హైదరాబాద్‌: ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన 32 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికుడి హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన పి. ప్రసాద్ అనే కార్మికుడి మృతదేహం ఈ నెల 18వ తేదీన అయోధ్యనగర్ స్మశానవాటిక వద్ద కనిపించింది.

మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పదమైన మృతిగా పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. జీడిమెట్లోని మస్కిటో కాయిల్ కంపెనీలో పనిచేసే రాజ్యలక్ష్మి అనే మహిళను ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు కూడా. సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదని రాజ్యలక్ష్మి ప్రాథమిక విచారణలో పోలీసులకు చెప్పింది.

అయితే, గొంతు నులిమి ప్రసాద్‌ను హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దాంతో పోలీసులు రాజ్యలక్ష్మి ఫోన్ కాల్ వివరాలను విశ్లేషించారు. ఆమె తన సహోద్యోగి శేఖర్‌కు హత్య జరిగిన రోజు చాలాసార్లు ఫోన్లు చేసినట్లు తేలింది.

రాజ్యలక్ష్మిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. శేఖర్ సహాయంతో ఈ నెల 17వ తేదీ రాత్రి భర్తను చంపినట్లు ఆమె విచారణలో అంగీకరించింది. శేఖర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యలక్ష్మి సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+