మహిళపై అత్యాచారం: కౌన్ బనేగా కరోడ్ పతితో మోసం
విజయవాడ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని రెడ్డిగూడెం మండలం ఓబులపురంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలం ఎమ్మెస్సీ విద్యార్థినిని కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం పేరుతో ఓ వ్యక్తి మోసగించాడు. అతన్ని శనివారంనాడు పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ చక్రవర్తిగా నిందితుడిని గుర్తించారు.

ప్రదీప్ చక్రవర్తి కొన్ని రోజుల క్రితం ఆద్ర విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ విద్యార్థిని ఇంద్రజకు ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామని, ప్రైజ్ మనీ వచ్చిందని, దాన్ని పంపేందుకు అవసరమైన డీడీ, రవాణా చార్జీలు చెల్లించాలని చెప్పాడు.
ఆ మాటలను నమ్మిన ఇంద్రజ కొంత మొత్తం నగదును అతనికి పంపించింది. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కోల్‌కాతలో దాక్కున్న ప్రదీప్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications