రేప్ చేసి మహిళకు ఉరి: ఏడేళ్ల బాలికపై అత్యాచారం
గుంటూరు: గుంటూరు జిల్లాలో రెండు దారుణమైన సంఘటలు జరిగాయి. ఓ సంఘటన జిల్లాలోని మాచర్ల మండలం కొత్తపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వివాహితపై కొందరు దుండగులు అత్మాచారం చేసి ఆపై ఆమెను హత్య చేశారు. చర్చి ఆవరణలోని చెట్టుకు లక్ష్మమ్మను ఉరేసి దుండగులు హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు.
మరో సంఘటన జిల్లాలోని మంగళగిరి శివారులోని ఎర్రబాలెం గ్రామ పరిధిలో జరిగింది. ఏడేళ్ల బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశఆడు. ఒరిస్సా నుంచి కూలీ పనులకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఎర్రబాలెం పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

గురువారం తెల్లవారుజామున బాలికను సమీపంలోని గోదాం ప్రాంతానికి తీసుకుని వెళ్లి గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. డిఎస్పీ మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications