గెంటేశారు: ఇంటిముందే పిల్లలతో భార్య ధర్నా (పిక్చర్స్)

హైదరాబాద్: కొడుకు పుట్టలేదనే సాకుతో భార్య, ముగ్గురు కూతుళ్లను ఇంట్లోంచి తరిమేసిన ప్రబుద్దుడి నిర్వాకం హైదరాబాదులో బుధవారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పరిగి మంచనపల్లి గ్రామానికి చెందిన రమాదేవికి దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన సంతోష్ కుమార్‌తో 2005లో వివాహం జరిగింది. అతను మలక్‌పేటలో ఉల్లిగడ్డ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టే వరకు కాపురం సజావుగానే సాగింది. అప్పటి నుండి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి.

ఆడపిల్లలు పుట్టారనే నెపంతో రూ.50 లక్షలు ఇస్తామని తమ కొడుకును విడిచి వెళ్లి పోవాలని అత్త 2008లో బెదిరించారు. 2009లో ఈమె మరో పాపకు జన్మనిచ్చింది. దీంతో వేధింపులు ఎక్కువయ్యాయి. కోటి రూపాయలు ఇస్తామని వెళ్లి పోవాలని బెదిరించారు. ఈ క్రమంలో దసరాకు ముందు బాధితురాలు స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, సైబరాబాద్ కమిషనర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ తదితరులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పి పంపించారు. దసరాకు పుట్టింటికి వెళ్లిన రమాదేవి బుధవారం తన ముగ్గురు కూతుళ్లతో అత్తిండికి రాగా వారు ఇంట్లోకి రానివ్వలేదు. పోలీసులకు, కోర్టుకు ఫిర్యాదు చేశారని ఆమెను బయటకు గెంటేశారు. దీంతో రమాదేవి కూతుళ్లతో ఇంటి ముందే ఆందోళనకు దిగింది. తనకు ఏ కేసు అవసరం లేదని, న్యాయం చేయాలని బుధవారం డిమాండ్ చేసింది.

ధర్నా 1

ధర్నా 1

ఇంటి నుండి అత్తింటి వారు గెంటేయడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటి ముందే ధర్నా చేస్తున్న రమాదేవి.

ధర్నా 2

ధర్నా 2

రమాదేవి, సంతోష్ కుమార్‌ల ముగ్గురు చిన్నారులు మనోజ్ఞా, దేవార్షి, శ్రీవర్షిణిలు. తల్లితో పాటు వారు ఇంటి ముందు కూర్చున్నారు.

ధర్నా 3

ధర్నా 3

కొడుకు పుట్టలేదనే సాకుతో భార్య, ముగ్గురు కూతుళ్లను ఇంట్లోంచి తరిమేసిన ప్రబుద్దుడి నిర్వాకం హైదరాబాదులో బుధవారం వెలుగు చూసింది.

ధర్నా 4

ధర్నా 4

దసరాకు పుట్టింటికి వెళ్లిన రమాదేవి బుధవారం తన ముగ్గురు కూతుళ్లతో అత్తిండికి రాగా వారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో రమాదేవి కూతుళ్లతో ఇంటి ముందే ఆందోళనకు దిగింది.

ధర్నా 5

ధర్నా 5

ఇంటి నుండి అత్తింటి వారు గెంటేయడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటి ముందే ధర్నా చేస్తున్న రమాదేవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+