Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను రాజకీయాల్లోకి రాను: చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి

తమ కుటుంబంలో మహిళా సాధికారత ఉందని ఎపి సిఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి పాలించిన ప్రాంతంలో సదస్సు గర్వకారణమని న్నారు.

అమరావతి: తాను రాజకీయాల్లో రాబోనని నారా బ్రాహ్మణి చెప్పారు. దేశంలో మహిళా స్వావలంబన తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో మహిళా సదస్సుకు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌తో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. డెయిరీ పరిశ్రమతోనే మహిళలకు ఉపాధి ఎక్కువగా లభిస్తుందని చెప్పారు.

మహిళా సాధికారత కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, తమ కుటుంబంలో అది ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఆమె శనివారంనాడు ప్రసంగించారు.

జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ కూతురు కూడా అయిన బ్రాహ్మణి అన్నారు. మహిళలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై ఈ సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

Women empowerment exists in my family: Brahmani

తల్లి పేరును తన పేరుకు ముందు చేర్చుకున్న గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి అని, ఆయన పాలించిన అమరావతి ప్రాంతంలో మహిళా సదస్సు జరగడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌ వచ్చాక రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని.. మహిళలకు విద్య ఆవశ్యకతను ఎన్టీఆర్‌ గుర్తించారని తెలిపారు.

అవకాశాలు కోసం చూడకుండా వాటిని అందిపుచ్చుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. పనిచేసే వేధింపులకు గురైతే వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.

దేశంలో మహిళలపై అరాచకాలు ఆగేలా కృషి చేయాలని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కన్సల్టెంట్‌ ఎడిటర్‌ సాగరికా ఘోష్‌ పిలుపునిచ్చారు. మహిళలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ కొత్త ఒరవడికి పునాదులు వేయాలని చెప్పారు.

నేటి సమాజంలో మహిళలు అనేక సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి అన్నారు.స్త్రీ, పురుష సమానత్వంపై వేదికలపై మాట్లాడుకుంటున్నామని, కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితుల్లేవని అభిప్రాయపడ్డారు.

మహిళలకు సమాన హక్కులతో పాటు వివక్షను దూరం చేసేలా కార్యక్రమాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆలోచనా ధోరణులు మారితేనే మహిళా సాధికారత వాస్తవరూపం దాలుస్తుందని అన్నారు. సమాజంలో మరుగున పడిపోయిన అంశాలపై మాట్లాడుకునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఆమె అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+