మహిళపై గ్యాంగ్‌రేప్: అవమానంతో దంపతుల సూసైడ్

 A Women gang raped and that couple commits suicide
గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో దారుణం జరిగింది. ఓ వివాహితపై ఐదుగురు యువకులు కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అవమానభారానికి గురైన ఆ దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్థానికంగా కిరాణా షాపు నిర్వహించుకునే శ్రీనివాస్‌రావు, జయలక్ష్మి దంపతులు పొన్నూరులోని లాల్‌జాన్‌పాషా పార్క్ వద్ద నివాసముంటున్నారు. కాగా జయలక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన కొంతమంది యువకులు ఆమెను బెదిరించి డబ్బులు తీసుకోవడంతో పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త స్థానికంగా ఉన్న నిందిత యువకులను ఎదురించే ధైర్యం లేక అవమానభారంతో కుమిలిపోయారు. చివరకు దంపతులిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఘటన గురించిన వివరాలను తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు శ్రీనివాస్.

సూసైట్ నోట్ ఆధారంగా లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దంపతుల ఆత్మహత్యతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అగ్ని ప్రమాదం: తల్లీకూతుళ్ల సజీవ దహనం

అనంతపురం: జిల్లా శివారులోని అక్కంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ గుడిసె పూర్తిగా ఖాళీ పోయింది. దీంతో గుడిసెలో ఉన్న తల్లీ కూతుళ్లిద్దరూ సజీవ దహనమయ్యారు. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+