Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చే ఏడాది ఖరీఫ్ కు పోలవరం రెడీ-ఎత్తూ తగ్గదు-జగన్ హామీ- బాబు మరగుజ్జు కావడం ఖాయం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రశ్నే లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హామీ ఇచ్చారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే తన పరిమాణం తగ్గించుకుని మరగుజ్జు కావడం ఖాయమన్నారు. అసెంబ్లీలో ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి ముందునుంచీ ఎలా ఉందో జగన్ వివరించారు.

పోలవరంపై అసెంబ్లీలో చర్చ

పోలవరంపై అసెంబ్లీలో చర్చ


పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందనే అంశాన్ని జగన్ ఇవాళ అసెంబ్లీ వెల్లడించారు. తాము మాత్రం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాత రేట్ల ప్రకారం నిధులు కేటాయిస్తోందని, సవరించిన డీపీఆర్ ఆధారంగా నిధులు తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.

చంద్రబాబుది మానవ తప్పిదం

చంద్రబాబుది మానవ తప్పిదం

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసినవి మ్యాన్ మేడ్ డిజాస్టర అని జగన్ అసెంబ్లీలో జగన్ గుర్తుచేశారు. ముందుగా ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని, దీని వల్ల ముంపు జరిగితే ఆ బాధ్యత ఎవరిదని జగన్ ప్రశ్నించారు. 2 కిలోమీటర్ల కాఫర్ డ్యామ్ అసంపూర్తిగా వదిలేశారని,దాంతో స్పిల్ వే పనులు పూర్తి కాలేదని జగన్ గుర్తుచేశారు. స్పిల్ వే కట్టకుండానే ఇనుప రేకుల గేట్లు పెట్టారని జగన్ విమర్శించారు. గేట్లు పెట్టకుండానే ప్రాజెక్టును చంద్రబాబు జాతికి అంకితం చేశారని,కానీ తాము మాత్రం 48 గేట్లు పెట్టామన్నారు. మెయిన్ డ్యామ్ లో గ్యాప్ 3ని కూడా తాము పూర్తి చేసినట్లు జగన్ వెల్లడించారు. గతంలో జరిగిన పనులకు, ప్రస్తుతం అక్కడున్న పరిస్ధితిని చూపించాలా నాడు-నేడు ఏవీని సభలో ప్రదర్శించారు.

ఎత్తు తగ్గించబోమని జగన్ హామీ

ఎత్తు తగ్గించబోమని జగన్ హామీ

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారంటూ విపక్షాలతో పాటు ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ మోడీ, గజేంద్ర సింగ్ షెకావత్ ఈ టీవీ ఛానళ్ల అధిపతులకు చెవిలో చెప్పారా అని జగన్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ పోలవరం ఎత్తు తగ్గించోమని అసెంబ్లీ వేదికగా జగన్ హామీ ఇచ్చారు. ఇందులో అనుమానాలు అవసరం లేదన్నారు. ఎల్లో మీడియా మాత్రం ఎత్తుపై ప్రజల్లో అనుమానాలు నెలకొనేలా ప్రవర్తిస్తోందని జగన్ మండిపడ్డారు.

 2023 ఖరీఫ్ కు పోలవరం రెడీ

2023 ఖరీఫ్ కు పోలవరం రెడీ

తాము అధికారంలోకి వచ్చాక పోలవరం పనుల్లో వేగం పెరిగిందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జగన్ తెలిపారు. కేంద్రం సాయంతో పునరావాస పనుల్ని కూడా వేగంగా పూర్తిచేస్తామన్నారు. కరోనాతో పాటు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నా 2023 ఖరీఫ్ కు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. డిజైన్లలో కొంత ఆలస్యం జరుగుతోందని, అయినా ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఖరీఫ్ కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు తన తండ్రి వైఎస్ కల అని, దీన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+