Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికుల ఛలో ఢిల్లీ .. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు రంగం సిద్ధం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని స్పష్టంగా చెబుతోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ, హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ విచారణ సమయంలోనూ కేంద్రం తమ వైఖరి స్పష్టంగా చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరణ చేస్తామని తేల్చిచెప్పింది.

కేంద్రం తీరుతో విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళనను ఉదృతం చేశారు. విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి జాతీయ స్థాయిలో ఆందోళన కు పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు తెలపాలని, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమవుతున్న విశాఖ కార్మికులు, వేలాది సంఖ్యలో విశాఖ నుండి హస్తినకు బయలుదేరాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ నెల 2, 3 తేదీలలో నిరసనలు తెలపడానికి సన్నాహాలు చేసుకున్నారు.

Workers chalo Delhi for Visakhapatnam steel plant .. ready for agitation at Jantar Mantar

జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తేనే కేంద్రం దిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2,3 వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే వేలాది సంఖ్యలో విశాఖ ఉక్కు కార్మికులు ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు కొందరు విమానాల్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు.శనివారం రాత్రి నుండి ఢిల్లీ బాట పట్టిన విశాఖ ఉక్కు కార్మికులు తమ గళాన్ని ఢిల్లీ వేదికగా గట్టిగా వినిపించనున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్లకు చేరుకున్న కార్మికులు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.జనవరి నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుండి కార్మికులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదున్నర నెలలుగా పోరాడుతున్నా కేంద్రానికి తమ గోడు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+