• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జంగిల్ రాజ్ లా రాష్ట్రం, నాన్ పర్ఫార్మెన్స్ సీఎం.. జగన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో జరిగేదిదే : యనమల విశ్లేషణ

|

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి హయాలో ఏపీలో ఐదేళ్ళ పాలన ఎలా ఉంటుందో ఆయన వివరించారు . నాన్ పర్ఫామెన్స్ సీఎంగా జగన్ మిగిలిపోయారని విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తొలి ఏడాది 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడులు, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా, అభివృద్ధి సంక్షేమం లేకుండా పోయాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

జగన్ రెడ్డీ... ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్, ఈ పాపం వూరికే పోదు : లోకేష్ ధ్వజం

జగన్ తన చేతగానితనం .. ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా

జగన్ తన చేతగానితనం .. ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా

అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో కావలసిన అన్నీ ఉన్నా జగన్ తన చేతగానితనం తో ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక రెండో సంవత్సరం 2020 - 2021 లో కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడిందని, కరోనా కారణంగా చూపించుకున్న జగన్ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. మొదటి సంవత్సరం నాన్ పర్ఫార్మెన్స్ సీఎంగా మిగిలిన జగన్ రెండో సంవత్సరం కూడా చేతగానితనంతోనే పాలన సాగించారు.

రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా .. వైసీపీ నేతల సొంత ఖజానాలు ఫుల్లు

రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా .. వైసీపీ నేతల సొంత ఖజానాలు ఫుల్లు

ఈ రెండు సంవత్సరాల నుండి అటు జగన్ రెడ్డి చేతగానితనం, మరోవైపు కరోనా రాష్ట్రంపై దుష్ఫలితాలను చూపించాయని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఇక రాబోయే మూడో ఏడాది కూడా పరిస్థితులు ఆశాజనకంగా ఉండకపోవచ్చని అభిప్రాయాన్ని యనమల రామకృష్ణుడు వ్యక్తం చేశారు. రాబోయే మూడో ఏడాది కూడా ఇలాంటి దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని, ఇదే సమయంలో వైసీపీ నేతలు సొంత ఖజానాలు మాత్రం నిండిపోతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు యనమల.

 రెండేళ్ళు చేసింది సున్నా .. మూడో యేడు ముదనష్టమే

రెండేళ్ళు చేసింది సున్నా .. మూడో యేడు ముదనష్టమే

మూడో ఏడాది కూడా ముదనష్టంగానే ఉంటుందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లో పెట్టిన రెండు బడ్జెట్ల లోనూ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఇక మూడవ బడ్జెట్ కూడా వాస్తవానికి దూరంగానే ఉంటుందంటూ యనమల వ్యాఖ్యానించారు. ఈ మూడేళ్ల ప్రభావం నాలుగో ఏడాది పై పడుతుందని చివరి ఏడాది ఎన్నికల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడిన యనమల రామకృష్ణుడు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక వనరులను ఎలా పెంచుకోవాలో చేత కాదన్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవడం కూడా రాదంటూ వ్యాఖ్యానించారు యనమల రామకృష్ణుడు .

రాష్ట్రంలో చెడు దే రాజ్యంగా మారిందని, సైతాన్ లు

రాష్ట్రంలో చెడు దే రాజ్యంగా మారిందని, సైతాన్ లు

రెచ్చిపోతున్నారు అని, రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పై దాడికి కూడా తెగబడుతున్నారు అని యనమల పేర్కొన్నారు . జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి అన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రాజ్యాంగాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని, ప్రజల ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారని యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసిపి గవర్నమెంట్ టెర్రరిజంతో ప్రజల్లో భయం

వైసిపి గవర్నమెంట్ టెర్రరిజంతో ప్రజల్లో భయం

వైసిపి ఎమ్మెల్యే లు గ్యాంగ్ లను వెంటేసుకుని ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటూ యనమల విమర్శించారు. వైసిపి గవర్నమెంట్ టెర్రరిజంతో బెంబేలెత్తిపోయేలా చేస్తోందని మండిపడ్డారు .ఇటువంటి విధ్వంసకర పాలన, అవినీతి పాలన, రాక్షస పాలన దేశచరిత్రలో చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన పై, జగన్ పరిపాలన తీరుపై యనమల నిప్పులు చెరిగారు.

ఐదేళ్ళ జగన్ పాలన లో జరిగేది ఇదే అని యనమల షాకింగ్ విశ్లేషణ చేశారు .

English summary
TDP senior leader Yanamala Ramakrishnudu made shocking comments on AP CM Jagan. He explained how the five-year rule in AP was under Jagan Reddy. He criticised Jagan is a non-performance CM turning AP into a jungle raj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X