ఏపీ ప్రజలకు శుభవార్త: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన
ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
అమరావతి: ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
జీఎస్టీ ప్రభావం రాష్ట్ర వృద్ధి రేటుపై పడలేదన్నారు. కృష్ణా జిల్లాలోను కానూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీతో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు (11.72 శాతం) సాధించిందని చెప్పారు.

స్థిరాస్తి రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో వృద్ధి లేదన్నారు. వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేయకుండా ఆదాయం పెంచే విధంగా అధికారులు పని చేయాలన్నారు. శాఖా పరంగా రూ.40 వేలకోట్లు పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు అందులో 44 శాతం వసూలు జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications