ఎట్టకేలకు రేవంత్ ఆరోపణలపై స్పందించిన యనమల: ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం స్పందించారు. పార్టీ మారడం కోసమే తనపై రేవంత్ ఆరోపణలు చేశారని అన్నారు.

  Today TOP 10 Trending News టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  కవిత, జగన్‌‌లతో రేవంత్, కేసీఆర్ భేటీ, ఢిల్లీ చిట్టా విప్పుతా: పయ్యావుల సంచలనం

  అందుకే నాపై విమర్శలు..

  అందుకే నాపై విమర్శలు..

  తనకు తెలంగాణ కాంట్రాక్టులుంటే వాటిని రేవంత్ రెడ్డి తీసుకోవచ్చని అన్నారు.
  ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ రేవంత్ తీసుకోవచ్చని యనమల చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేసినట్లుందని ఆయన అన్నారు.

  బావమరిది కళ్లల్లో ఆనందం: కేటీఆర్‌పై రేవంత్ సంచలనం, పరిటాలపైనా..

  ఆ ప్రచారంపై రేవంత్..

  ఆ ప్రచారంపై రేవంత్..

  కాగా, టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరిగింది. రేవంత్ ఈ విషయంపై స్పందిస్తూ తాను కాంగ్రెస్ పెద్దలను కలిస్తే తప్పేంటని అన్నారు.

  ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

  ఏపీ నేతలపై రేవంత్ ఫైర్

  ఏపీ నేతలపై రేవంత్ ఫైర్

  అంతేగాక, ఏపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టి జైలుకు పంపిన కేసీఆర్‌తో ఏపీ నేతలు అంటకాగడమేంటని ప్రశ్నించారు

  ఆరోపణలు.. కౌంటర్లు

  ఆరోపణలు.. కౌంటర్లు

  తెలంగాణలోని వ్యాపారాలను కాపాడుకునేందుకే ఏపీ మంత్రులు యనమల, పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావు లకేశవ్‌లు కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఇటీవల రేవంత్ వ్యాఖ్యలపై పయ్యావుల కూడా తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాజాగా, మంత్రి యనమల కూడా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఇంతకుముందే పరిటాల శ్రీరామ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh minister Yanamala Ramakrishnudu on Monday responded on Revanth Reddy's comments on him.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి