కంటికి కన్ను, పంటికి పన్ను.. టీడీపీ దాడులపై గోరంట్ల మాధవ్ మాస్ వార్నింగ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీలో కొనసాగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన వైసిపి నాయకులు కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ దాడులను సహించేది లేదంటూ హెచ్చరించారు.

దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం
టిడిపి కూటమి గెలిచిందని ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, దాడులకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. టిడిపి దాడుల పైన అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఇప్పటికీ పోలీసులు పట్టించుకోకుంటే తామేమిటో కూడా చూపిస్తాం అంటూ విరుచుకుపడ్డారు.

YCP Ex MP Gorantla Madhav mass warning on TDP attacks after election results

మాస్ వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల మాధవ్
మీరు ఐదేళ్లపాటు సంబరాలు చేసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ కార్యకర్తల మీద, దాడులు చేస్తున్నారని, విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులపై ఒక దశ వరకు మాత్రమే తాము ధర్మబద్ధంగా వెళ్తామన్నారు. నాగరిక పద్ధతులలో ఎస్పీలు, కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ ఆగకుంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు వెళతాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

ప్రాణాలు అడ్డు పెట్టయినా వైసీపీని బలోపేతం చేస్తాం
తమ ప్రాణాలు అడ్డుపెట్టి అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు రోజులైనా కాకముందే ఇప్పటికే విప్లవం రావడం మొదలైందని, టిడిపి నాయకులు తమ కార్యకర్తలు, అభిమానులను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు.

వైసీపీ కార్యకర్తలు అభద్రతా భావానికి లోను కావద్దు
తెలుగుదేశం పార్టీ దాడులతో ఇబ్బంది పడుతున్న తమ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భరోసా కల్పిస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అభద్రతా భావానికి లోను కావద్దని సూచించారు. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నేతలు కొట్లాటల మీద కాకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించాలని, పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం పోరాటం చేయాలని సూచించారు వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+