టీడీపీ కంచుకోటలు బద్దలుకొడుతున్న వైసీపీ
Recommended Video
ఏపీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు బలపడుతున్నాయి. టీడీపీ కంచుకోటల్లో వైసీపీ తొలి ట్రెండ్స్‌లో వైసీపీ ముందంజలో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ వెనుకంజలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ ఆధిక్యతలో ఉన్నారు. నర్సాపురంలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది.
టీడీపీ కంచుకోటల్లో ఫ్యాన్ హవా..
తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్‌లో వైసీపీ హవా కనిపిస్తోంది. టీడీపీకి తిరుగులేని నియోజకవర్గాలుగా ఉన్న పొన్నూరు, పెదకూరపాడు, అనంత అర్బన్, వేమూరు, ఒంగోలు, గుంటూరు లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మంగళగిరి తొలి ట్రెండ్స్‌లో టీడీపీ అభ్యర్ది నారా లోకేశ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలుపు ఖాయమని చెబుతున్న సమయంలో తాజా ట్రెండ్స్‌లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక, కీలకమైన రాప్తాడులో టీడీపీ అభ్యర్ది పరిటాల శ్రీరాం వెనుకంజ లో ఉన్నారు. ఇక, కడప జిల్లాలో వైపీపీ క్లీన్ స్వీప్ దిశగా కనిపిస్తోంది. ఇదే సమయంలో లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ హవా సాగుతోంది. కీలకమైన అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో తొలి ట్రెండ్స్‌లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఏడు లోక్‌సభ స్థానాల్లో వైసీపీ ముందంజలో కనిపిస్తోంది.

జనసేనాని వెనుకంజ...
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు జనసేన అధినేత ఖచ్చితంగా గెలుస్తారని భావించిన భీమవరంలో వెనుక బడ్డారు. అక్కడ తాజా ట్రెండ్స్ మేరకు పవన్ కళ్యాన్ మీద వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ ఆధిక్యత లో ఉన్నారు. నగరిలో రోజా ముందంజలో ఉన్నారు. టీడీపీ ఇప్పటి వరకూ ఒక్క లోక్‌సభలోనూ ముందు వరుసలోకి రాలేదు. ఇక, రాయలసీమలో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన పశ్చిమ గోదావరిలో ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి కనిపిస్తోంది. సత్తెనపల్లిలో స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాద్ వెనుకబడి ఉన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఆసక్తి కరంగా ఉన్న జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్ది సుధీర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. నెల్లూరు అర్బన్‌లో నారాయణ వెనుకంజలో ఉన్నారు. తాజా సమాచారం వరకు నారాయణ 1800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. చీరాలలో వైసీపీ అభ్యర్ది ఆమంచి కృష్ణమోహన్ అధిక్యతలో నిలిచారు.












Click it and Unblock the Notifications