ఎన్నికల ఫలితాలపై వైసీపీకి క్లారీటీ వచ్చేసిందా..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. రేపటితో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. జగన్ బస్సు యాత్ర టెక్కలిలో పూర్తయింది. చంద్రబాబు, పవన్ ప్రచారం కొనసాగిస్తున్నారు. రేపు పులివెందుల లో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 26న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీల పైన ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల పైన వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఎన్నికల ఫలితాల పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని చురకలంటించారు. జనసేనకు ఇచ్చింది 21 సీట్లే అని గుర్తు చేశారు. జనసేన, బీజేపీ కూటమిలో అందరూ చంద్రబాబు మనుషులే అని విమర్శించారు. 2014లో ఇదే కూటమిపేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

రాజకీయాల్లో విమర్శలు ఎన్నైనా చేయవచ్చని.. అయితే వాటికి ఆధారాలు చూపించాలన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందెవరని నిలదీశారు. అప్పుడు చంద్రబాబు ప్రజలను నమ్మించి ఎలా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 2024లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని వారికి కోపం అన్నారు. చంద్రబాబు నాటకంలో పవన్ కళ్యాణ్ ది చిన్న పాత్రేనని చెప్పారు. కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సజ్జల తెలిపారు.












Click it and Unblock the Notifications