అరాచకాలు తట్టుకోలేక టైమ్ చూసి వైసీపీని దెబ్బకొట్టిన ఓటర్లు, చేసినపాపం ఊరికేపోతుందా ?
ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మంగళవారం ప్రజలు మంగళం పాడేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన 175 మంది అభ్యర్థుల తలరాతలు మంగళవారం బయటకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం అందుకున్న వైసీపీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మిగిలింది కేవలం 11 సీట్లు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు బద్దలు కొట్టింది. వేసవిలో వైసీపీకి చెమటలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి భారీ విజయాన్ని అందించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు.

ఇంతకాలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం హోదాలో చక్రం తిప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చెప్పిందే వేధం, వైసీపీ చెప్పిందే చట్టం, వైసీపీ చెప్పిందే న్యాయం అని ప్రజలు రగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం ఏకపక్షంగా అన్ని జరిగాయి. గతంలో అనేక జిల్లాల్లో మునిసిపాలిటీలు, జిల్లా పంచాయితీ, గ్రామ పంచాయితీ ఎన్నికలు కూడా జరనివ్వకుండా పోటీలో నిలబడే టీడీపీ, జనసేన అభ్యర్థుల మీద దాడులు చేసి, వారిని కిడ్నాప్ లు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
చివరికి మునిసిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు, జెడ్ పీటీసీ సభ్యులు, గ్రామ పంచాయితీ సభ్యులు, సర్పెంచ్ ల పదవులకు పోటీనే లేకుండా చేసి అన్ని ఏకగ్రీవం అంటూ వైసీపీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇన్ని అరాచకాలు చేస్తున్నా వైసీపీ హైకమాండ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా అరాచకాలుచేస్తున్న సొంత పార్టీ నాయకులను వెనుకేసుకుని వచ్చింది. ఏం చెయ్యలేక ప్రజలు సైతం నోరు మూసుకుని సైలెంట్ గా ఉండిపోయారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఎవరిపాటికి వాళ్లు ఉండిపోవడంతో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయింది. చిక్కిందే చాన్స్ అంటూ వైసీపీ నాయకులు ఇంకా రెచ్చిపోయారు. ఇదే సమయంలో వైసీపీలోని కొందరు మంచిగా ఉండే నాయకులకు చెడ్డపేరు వచ్చింది. ఒకరు చేసిన పాపం తలాపిడెకెడు అనే సామెతలాగా కొందరు వైసీపీ నాయకులు చేసిన ఆగడాలకు మొత్తం వైసీపీ నాయకులు చెడ్డపేరు మూటకట్టుకున్నారు.
వైసీపీ అరాచకాలకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు వంతపాడటంతో టీడీపీ, జనసేన నాయకులు ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావడంతో అప్పుడు ప్రజలకు కొంచెం ధైర్యం వచ్చింది. మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యడంతో వైఎస్ జగన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. కనీసం 50 నుంచి 60 సీట్లు అయినా వస్తాయి అనుకుంటే కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం అయ్యింది.












Click it and Unblock the Notifications