నాకు గిట్టుబాటు కాలేదు .. అందుకే నొక్కేశా .. ఓట్ల కోసం ఆ పని కూడా చేశా .. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

Recommended Video

    కౌలు రైతులను తానే నోక్కేసానన్న కరణం ధర్మశ్రీ| MLA Sensational Comments On Benefits Of Tenant Farmers

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కోసం తలలు తీసి యజ్ఞగుండంలో వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాదు జగన్ కోసం 60 మంది ఎమ్మెల్యేలం ఒక దళంగా ఉన్నామని చెప్పి షాకింగ్ కామెంట్ చేస్తే ఇప్పుడు ఆసెంబ్లీలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుగా కౌలు రైతులకు రావాల్సినవి తానె నొక్కేసేవాడినని చెప్పి షాక్ కు గురి చేశారు .

    కౌలు రైతులకు రావాల్సినవి తానె నోక్కేశానని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ

    కౌలు రైతులకు రావాల్సినవి తానె నోక్కేశానని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ

    2019 మార్కెటింగ్ బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించిన ధర్మశ్రీ తాను ఒక రైతును అంటూ చెప్పుకొచ్చారు. తనకు 25 ఎకరాల వ్యవసాయం ఉంటే దానిలో 5 ఎకరాలు తాను సొంతంగా పండించుకుంటానని మిగిలిన 20 ఎకరాలు నలుగురు కౌలు రైతులకు పండించుకోవడానికి ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇక కౌలు రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కూడా తానే తీసుకున్నానని సభా ముఖంగా చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ పుట్ సబ్సీడీ, పంట భీమా, పంట నష్టాన్ని తామే నొక్కేసేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు ఇవ్వకుండా తామే నొక్కేసేవాళ్లమని చెప్పిన ఆయన అందర్నీ అవాక్కయ్యేలా చేశారు.

    ఓట్ల కోసం కౌలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టలేదన్న ఎమ్మెల్యే ధర్మ శ్రీ

    ఓట్ల కోసం కౌలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టలేదన్న ఎమ్మెల్యే ధర్మ శ్రీ

    తమకు గిట్టుబాటు కాకపోవడం వల్లే కౌలు రైతులకు ఇవ్వకుండా వాటిని నొక్కేసేవాడినని ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ చెప్పారు . అయితే అందులోనూ రాజకీయం చేశానని చాలా చక్కగా చెప్పారు సదరు ఎమ్మెల్యే . కౌలు రైతు ఎంత ఇస్తే అంతే తీసుకునే వాడినని ఎందుకంటే రేపు ఓటు వేయరని భయం అంటూ చెప్పుకొచ్చారు. ఇకముందు అలా కౌలు రైతులకు నష్టం జరగదని పేర్కొన్న ఆయన మార్కెటింగ్ బిల్లు ద్వారా కౌలు రైతులకు కూడా ఎంతో మంచి జరుగుతుందన్నారు.

    రాష్ట్రంలో సాగు చేసే రైతులలో కౌలు రైతులే ఎక్కువ అన్న వైసీపీ ఎమ్మెల్యే

    రాష్ట్రంలో సాగు చేసే రైతులలో కౌలు రైతులే ఎక్కువ అన్న వైసీపీ ఎమ్మెల్యే

    రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది రైతులు ఉంటే అందులో కౌలు రైతులే అత్యధికమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 16 లక్షలు మంది కౌలు రైతులు అని చెప్తోందని కానీ తనకు తెలిసి 40లక్షలు మంది కౌలురైతులు ఉండొచని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కేవలం ఉత్సవ విగ్రహాలు లాగే ఉన్నారని కానీ తమ ప్రభుత్వం వారికి తగిన గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లు మార్కెట్ యార్డ్ లు నిర్వీర్యం అయిపోయాయని ఆయన గత ప్రభుత్వం ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డుకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయలేదని అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా వాటిని విడుదల చేశామని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ బిల్లు ద్వారా సీఎం వైయస్ జగన్ రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , కౌలు రైతులకు రావాల్సిన ప్రయోజనాలు తామే నోక్కేశామని చెప్పటం మాత్రం షాకింగ్ అనిపించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+