vijayasai reddy chandrababu chandrababu naidu nara lokesh tdp atchannaidu campaign చంద్రబాబు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ టిడిపి అచ్చెన్నాయుడు ప్రచారం విజయ సాయి రెడ్డి politics
నాడు చంద్రన్నే సీఎం , నేడు అక్కుబక్కుం అచ్చెన్నే సీఎం , టీడీపీ జోకర్ల కామెడీ : సాయిరెడ్డి వ్యగ్యం
తెలుగుదేశం పార్టీపై అనునిత్యం నిప్పులు చెరిగే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా మరోమారు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎం అన్నారని, ఆ తర్వాత లొకేషన్ సీఎం అవుతాడని, ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏకంగా సీఎం అంటూ టిడిపి పెయిడ్ ఆర్టిస్టులు భజన చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా టీడీపీ పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టిడిపి పెయిడ్ ఆర్టిస్టులను ప్రచారం చేయండి అంటే కామెడి పండిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏపీలోనూ టీడీపీ కృష్ణార్పణం: మాలోకం, జెండా పీకేసే ముందు ఎమోషన్స్ మామూలే: సాయిరెడ్డి సెటైర్లు

ప్రచారం చేయమంటే పచ్చ పార్టీ జోకర్లు ఎన్నికల ప్రచారంలో కామెడీ చేస్తున్నారు
ఎక్కడి నుంచి తెస్తారు ఈ పెయిడ్ ఆర్టిస్టులను అని ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి ఎన్నికలకు ముందు జయము జయము చంద్రన్న అన్నారు. ఆ తర్వాత లోకేశుడే మహీశుడు అన్నారు . ఇప్పుడు అక్కుంబక్కుం అచ్చెన్నే సీఎం అని పాటలు పాడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఇక ప్రచారం చేయమంటే పచ్చ పార్టీ జోకర్లు ఎన్నికల ప్రచారంలో కామెడీ పండిస్తున్నారు అంటూ విజయ సాయి రెడ్డి విమర్శించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో మాట్లాడటానికి పచ్చకుల పార్టీకి ఒక్కసారైనా అంశమైన ఉందా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి .

ఎప్పటిలానే కేసులు , కులాలు, మతాలేనా మీ ప్రచారాస్త్రాలు ?
ఎక్కడెక్కడో అంశాలను లేవనెత్తి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, ఎప్పటిలానే కేసులు, కులాలు, మతాలేనా మీ ప్రచార అంశాలు అంటూ విరుచుకుపడ్డారు.
అంతేకాదు దిగ్గజ ఘాజీ విశ్లేషకుని పనైపోయింది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చకుల చానల్స్ కు రేటింగ్స్ రావడం లేదు. అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని మరో మేధావి బయలుదేరాడు అంటూ పేర్కొన్నారు .

బీకాం ఫిజిక్స్ సలహాలు మాకెందుకు, మీ పే మాస్టర్ చంద్రబాబుకు ఇవ్వండి
దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి పోరాడండి, విభజన సమస్యలపై ఒత్తిడి తెండి. ఈ బీకాం ఫిజిక్స్ సలహాలు మాకెందుకు ... మీ పే మాస్టర్ చంద్రబాబుకు ఇచ్చుకోండి అంటూ విజయ సాయి రెడ్డి విమర్శించారు . ఇక ఇదే సమయంలో సునీల్ దేవధర్ కి బీజేపీ కాదు సుజనా చౌదరినే హైకమాండ్ అంటూ బిజెపి నేతలను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఎందుకని మాత్రం తనని అడగవద్దని, వీరిద్దరినీ ఇక సునీల్ చౌదరి, సుజనా దేవధర్ అని పిలుద్దామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ పరువు తీసేస్తున్న సాయి రెడ్డి , టీడీపీ నేతల ఎదురు దాడి
ఏ చిన్న అవకాశం దొరికినా విజయసాయి రెడ్డి టిడిపికి , బీజేపీ నేతలకు చురకలు అంటిస్తున్నారు . ముఖ్యంగా ఇటీవల కాలంలో చంద్రబాబును , నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ , టీడీపీ పని అయిపోయిందని ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పరువు మాత్రం నిలువునా తీస్తూ విజయ సాయి రెడ్డి బాహాటంగానే విమర్శలు స్పందిస్తున్న తీరు టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిణామంగా మారగా టీడీపీ నేతలు విజయసాయి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు .