రేపు ఇచ్చాపురంలో వైసీపి బహిరంగ సభ..! పైలాన్ ను ఆవిష్కరించనున్న జగన్..!!
శ్రీకాకుళం/ హైదరాబాద్ : ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పెద్ద కొజ్జీరియా నుంచి ప్రారంభం అవుతుందని వైస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఉదయం 11 గంటలకు లొద్దకుట్టి గ్రామం వద్ద భోజన విరామం కోసం ఆగుతారని తెలిపారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరి గం.1.15 నిమిషాలకు ఇచ్చాపురంలోని పైలాన్ వద్దకు జగన్ చేరుకుంటారు. ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగసభ ప్రాంతానికి చేరుకొని 1.30కు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రఘురామ్ పేర్కొన్నారు.

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సుధీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో జగన్ పాల్టొంటారు. అంతకు ముందు పాదయాత్రకు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను జగన్మోహనం రెడ్డి ఆవిష్కరిస్తారు. జగన్ పాద యాత్ర ముగింపు కార్యక్రమాన్ని వైసీపి శ్రేణులు గొప్ప పర్వదినంగా జరుపుకునేందుకు సన్నామలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఇచ్చాపురం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications