చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ అరెస్ట్...కిడ్నాప్ అనుకొని పోలీసులను అడ్డుకున్న స్థానికులు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు:తెలుగుదేశం పార్టీ గురించి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగులు పెట్టాడనే ఆరోపణలతో పుంగనూరుకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ నవీన్‌కుమార్‌ రాజును ఆదివారం సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

అయితే హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఇన్నోవా వాహనంలో వచ్చి నవీన్‌కుమార్‌రాజును ఎక్కించుకొని వెళుతుండటంతో కలకలం రేగింది. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని భావించిన నవీన్ కుమార్ రాజు తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు విషయం తెలిపారు. ఆ క్రమంలో స్థానికులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకొని నవీన్ ను తీసుకువెళుతున్న ఇన్నోవాని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే...

చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తయిండ్లుకు చెందిన నవీన్‌కుమార్‌రాజు అనే యువకుడు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని తెలిసింది. ఆ క్రమంలో ఇతడు ఇటీవల సిఎం చంద్రబాబు, టిడిపి ని కించపరుస్తూ పలు పోస్టింగ్ లు పెట్టినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

YCP social media co-ordinator arrested

ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ రాజుపై గుంటూరు సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అతడిని అరెస్టు చేసేందుకు పుంగనూరుకు చేరుకున్నారు.
ఇన్నోవా వాహనంలో వచ్చిన పోలీసులు నవీన్‌ ఎక్కడనున్నాడో తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించేందుకు వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే గుర్తు తెలియని వ్యక్తులు నవీన్ కుమార్ రాజును ఇన్నోవా వాహనంలో ఎక్కించుకొని తీసుకువెళుతున్న విషయం తెలిసి స్థానికులు ఆ వాహనం నంబర్ నోట్ చేసుకొని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డికి విషయం తెలిపి వాహనం నంబర్ ఇచ్చారు. ఆ క్రమంలో స్థానిక వైసిపి నేతలు వాహనం నంబర్ ఆధారంగా వాల్మీకిపురం మండలం చింతపర్తి వద్ద ఇన్నోవాను అడ్డుకున్నారు. అయితే తాము గుంటూరు పోలీసులమని నవీన్‌కుమార్‌రాజుపై సైబర్‌క్రైం కేసు నమోదు కావడంతో అరెస్టు చేసిzతీసుకెళుతున్నామని పోలీసులు తెలపడంతో వాహనానికి దారి ఇచ్చారు.

English summary
Cyber crime police arrested Naveenkumar Raju, a resident of Punganur in connection with the alleged abusing posts over TDP in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X