Year Ender 2022 : ముందస్తు వేడి పెంచేసిన జగన్-వైసీపీతో పాటు విపక్షాల్లోనూ ! టర్నింగ్ పాయింట్ !
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడంటే 2024లోనే అని కచ్చితంగా రాజకీయ పార్టీలు చెప్పలేకపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ తమ క్యాడర్ కు రాజకీయ పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్న జగన్.. అదను చూసి ముందస్తు ఎన్నికలు పెట్టించేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో విపక్షాలను వెంటాడుతోంది. దీంతో చంద్రబాబు, పవన్, లోకేష్ ఇలా ప్రతీ ఒక్కరూ రోడ్లపైనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు
ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడని అడిగితే ఏపీలో రాజకీయ పార్టీలే కాదు సాధారణ ప్రజలు సైతం కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీనంతటికీ ప్రధాన కారణం సీఎం జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలే. దీంతో 2024కు బదులుగా వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు ఉండొచ్చన్న వాదనను కొట్టిపారేసేందుకు సైతం రాజకీయ పార్టీలు సందేహిస్తున్నాయి. అటు సొంత పార్టీ వైసీపీ నేతలకు సైతం జగన్ ఇవే సంకేతాలు ఇస్తున్నారు. పైకి మాత్రం 2024లోనే ఎన్నికలకు వెళ్తామని సజ్జల వంటి నేతలు చెప్తున్నా లోలోపల మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు వెళ్తున్నాయి.

ముందస్తుకు రెడీ చేసిన జగన్
ఏపీలో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలపై ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్. అందరి కంటే ముందే ఎన్నికల గురించి మాట్లాడటం మొదలుపెట్టిన జగన్.. తమ పార్టీ శ్రేణుల్ని, నేతల్ని ఆ దిశగా నడిపించడం ప్రారంభించారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని డిజైన్ చేయించడమే కాకుండా అందులో పార్టీ నేతలంతా తప్పనిసరిగా పాల్గొనేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనన్న ఆలోచనకు వైసీపీ నేతలంతా వచ్చేశారు. దీంతో జగన్ అనుకున్న విధంగానే వారిని ముందస్తు ఎన్నికల దిశగా నడిపిస్తున్నారు. ఇప్పటికే గడప గడప కార్యక్రమం దాదాపుగా 90 శాతం పూర్తయినట్లు చెప్తున్నారు. ఇందులో వైసీపీ నేతల హడావిడి చూస్తుంటే ఎన్నికలు ముందుగా వచ్చినా తమకు ఇబ్బంది లేనట్లుగానే కనిపిస్తోంది.

జగన్ దూకుడుతో చంద్రబాబు
గడప గడపకూ ప్రభుత్వం పేరుతో వైఎస్ జగన్ మొదలుపెట్టిన కార్యక్రమం విపక్ష నేత చంద్రబాబును పరుగులు తీయిస్తోంది. దీంతో ఆయన ముందుగా దానికి దగ్గరగా ఉండేలా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారు. ఇది సరిపోవడం లేదని ఆ తర్వాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ మరో కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు తన పర్యటనలకు ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. జగన్ దూకుడుతో ముందస్తు ఎప్పుడైనా రావొచ్చని పార్టీ నేతలకు చంద్రబాబు ఇప్పటికే పదుల సంఖ్యలో చెప్పేశారు. దీంతో టీడీపీ నేతలు కూడా చాలా చోట్ల దూకుడు పెంచారు. గతంలో కేసులకు, దాడులకు భయపడి ఇళ్లలో కూర్చున్న నేతలంతా ఇప్పుడు రోడ్లపై కనిపిస్తున్నారు. నారా లోకేష్ జనవరిలో మొదలుపెట్టే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇందులో భాగమే.

జగన్ దూకుడుతో పవన్ !
జగన్ దూకుడు చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూకుడు పెంచారు. ప్రస్తుతం జనసేన ఉన్న పరిస్ధితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సైతం గత ఎన్నికల ఫలితాలు రిపీట్ కావడం తథ్యమని భావించిన పవన్.. వైసీపీపై సమరశంఖం పూరించారు. పార్టీ 9వ ఆవిర్భావ సభలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని ప్రకటించిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయిన పవన్, అటు ప్రధాని మోడీతోనూ విశాఖలో భేటీ అయి చర్చలు జరిపారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి వీరిద్దరినీ మళ్లీ కలపడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి, జగన్ కు ప్రత్యామ్నాయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో జనంలో ఉండేందుకు రాష్ట్రవ్యాప్త యాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వారాహి పేరుతో భారీ వాహనాన్ని సైతం పవన్ సిద్దం చేసుకున్నారు. త్వరలో వారాహిపై పవన్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇలా ఈ ఏడాదిలో జగన్ తన సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాలను సైతం ఎన్నికల దిశగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
TN Election Survey: గెలిచేది ఆ పార్టీయేనా? జ్యోతిష్యుల షాకింగ్ జోస్యం! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications