లోకేశాన్ని మంత్రిని చేసి జనం నెత్తిన పెట్టాడు బాబు, చిట్టినాయుడికి ఎల్లో ఫంగస్ : సాయిరెడ్డి సెటైర్లు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబును, మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏకిపారేశారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేతన్నల దుస్థితిని తలచుకుంటే మనసు కలిచివేస్తోంది అంటూ చేసిన వ్యాఖ్యలకు సైరా పంచ్ వేశారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా చంద్రబాబును వదలకుండా విమర్శలు చేసే విజయసాయిరెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు ఏ రకమైన విమర్శలు చేసినా అన్నిటికీ సమాధానం చెప్తూ విజయ సాయి రెడ్డి తన మార్కు సంచలనాలకు తెర తీస్తున్నారు.

నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది బాబు : సైరా పంచ్

నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది బాబు : సైరా పంచ్

నేతన్నల దుస్థితికి కారణమైన నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది బాబు అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో నేతన్నలు దయనీయమైన పరిస్థితులు చంద్రబాబు పాలన లోనే ఉండేవని పేర్కొన్నారు. ఈరోజు చంద్రబాబు టిడిపి హయాంలో నేతన్నలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ప్రతి సంవత్సరం 50 వేల రూపాయల వరకు రాయితీలు ఇచ్చామని, వైసిపి హయాంలో అవన్నీ రద్దుచేసి ఇరవై నాలుగు వేలకు రాయితీలను కుదించి నేతన్నల బ్రతుకులను చీకట్లో నిలబెట్టారని, ప్రస్తుతం నేతన్నల దుస్థితి చూస్తే తన మనస్సు ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇక దీనికి కౌంటర్ గా విజయ సాయి రెడ్డి సైరా పంచ్ వేశారు. చంద్రబాబు నేతన్నల దుస్థితికి కారణం అంటూ రివర్స్ ఎటాక్ చేశారు.

నేతన్నల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని కితాబిచ్చిన సాయిరెడ్డి

నేతన్నల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని కితాబిచ్చిన సాయిరెడ్డి


ఇదే సమయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో చేనేత రంగ పరిరక్షణకు నేతన్నల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని, జగన్ సర్కార్ కు కితాబిచ్చారు. ఇదే సమయంలో అద్భుతమైన కళా నైపుణ్యంతో ఘనత తెచ్చిన మన చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ విజయ సాయి రెడ్డి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా మనం కూడా చేనేత వస్త్రాలను ఆదరించి నేతన్నలకు చేయూతనిద్దాం అంటూ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

 ఒక్క ఓటు పడకుండానే 200 మెట్లు ఎక్కించాడు చంద్రబాబు

ఒక్క ఓటు పడకుండానే 200 మెట్లు ఎక్కించాడు చంద్రబాబు

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ ను చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి దేనికీ పనికిరాడని చదువు చెప్పిన టీచర్ పెదవి విరిచినా లోకేశాన్ని మంత్రిని చేసి జనం నెత్తిన పెట్టాడు బాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఓటు పడకుండానే 200 మెట్లు ఎక్కించాడు అంటూ విమర్శించారు . మంగళగిరి పరాభవం తర్వాత కూడా బుద్ధి వికసించలేదు అని విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు . రానురాను నోరు మోరీ అయిందని, ఎల్లో ఫంగస్ సోకిందేమో చిట్టి నాయుడుకి అంటూ లోకేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శించారు.

వరెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా అపకీర్తి మూటగట్టుకున్న యనమల

వరెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా అపకీర్తి మూటగట్టుకున్న యనమల

అంతేకాదు ఆర్థిక నిర్వహణ లో వరెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా అపకీర్తి మూటగట్టుకున్న యనమల ఖజానా లోటు గురించి మాట్లాడటం ఛండాలంగా ఉంది అంటూ యనమల రామకృష్ణుడును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. పరిమితికి మించి అప్పులు చేశామని ఇకపై రుణం కూడా పుట్టదు అని నిస్సిగ్గుగా చెప్పింది ఆయనేనని విమర్శించారు. అంతేకాదు 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లిన చరిత్ర మరిస్తే ఎలా అంటూ యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+