100 అడుగుల లోయ: తిరుమలలో సహజసిద్ధ శ్రీవారికి సాహస పూమాల
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో యువ భక్తులు సాహసం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ మార్గంలోని కొండల్లో సహజంగా వేంకటేశ్వర స్వామి ప్రతిమ ఏర్పడింది.
సహజంగా ఏర్పడిన వేంకటేశ్వరుడి ప్రతిమకు తిరుమల్లోని కొందరు యువకులు ముప్పై అడుగుల గజమాలను వేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆ కొండ పైకి వెళ్లి శిలా ప్రతిమకు పూలమాల వేయడం ప్రమాదకరమైన పని.
రెండోకనుమలో తిరుమలకు సమీపంలో కొండ చివర ఈ వేంకటేశ్వర స్వామి సహజశిలా విగ్రహం ఉంది. ఏమాత్రం చిన్న పొరబాటు జరిగినా, మాలను వేయడానికి వెళ్లిన వారు ఎవరైనా వంద అడుగుల లోయలోకి జారి ప్రమాదానికి గురైయ్యే అవకాశముంది.

దాదాపు ఇలాంటి సంఘటనే శనివారం కూడా చోటుచేసుకుంది. అయితే జారిపడింది యువకులు కాకపోయినా, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ కావడంతో యువకులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి యువకులు స్వామి వారికి మాలను వేసి వచ్చారు.
తిరుమలలో రద్దీపై
తిరుమలలో రద్దీని తగ్గించడానికి టిటిడి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారాంతపు సెలవు నేపథ్యంలో రెండు లక్షలకు పైగా భక్తులు శనివారం కొండ పైకి చేరుకోవడం, ఆపై భారీ వర్షంతో భక్తుల ఇబ్బందుల నేపథ్యంలో టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు.
వర్షం తగ్గిన తర్వాత మహా లఘు దర్శనం ఏర్పాటు చేసి వేగంగా భక్తులకు దర్శనం చేయించడంతో పాటు ఈ ఉదయం నుంచి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల జారీని రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. ఇదే సమయంలో ప్రత్యేక బస్సులు నడిపి భక్తులు సులువుగా కొండ దిగి తిరుపతికి చేరేలా ఏర్పాట్లు చేశారు.దీంతో మధ్యాహ్నానికి రద్దీ తగ్గింది.












Click it and Unblock the Notifications