బెజవాడ దుర్గ గుడి హుండీలో చోరీ యత్నం

శివప్రసాద్ అనే ఆ యువకుడు దుర్గాదేవి దర్శించుకున్న తర్వాత ఆ పనికి పూనుకున్నాడు. అతను రెండుసార్లు చోరీకి ప్రయత్నించాడని, తొలి విడత కొంత నగదు అతని చేతికి చిక్కిందని చెబుతున్నారు. రెండోసారి మాత్రం అతను ఫలితం సాధించలేదని, రెండోసారి అతని ప్రయత్నాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.
అతని చేతికి పది, యాభై రూపాయల నోట్లు చిక్కినట్లు చెబుతున్నారు. అయితే, తాను ఉద్దేశ్యవూర్వకంగా ఆ పని చేయలేదని, దొంగతనం చేయడానికి ప్రయత్నించలేదని, బయటకు కనిపిస్తున్న డబ్బులను లోనికి తోయడానికి ప్రయత్నించానని శివప్రసాద్ అంటున్నాడు. దీంతో పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
బస్సు ఢీకొని విద్యార్థిని మృతి
చిత్తూరు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆరవ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. చిత్తూరు జిల్లా కొత్తకోటలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బాలిక మృతి చెందడంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications