12 ఏళ్ల బాలికపై మూడు నెలలుగా అత్యాచారం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంచన్‌బాగ్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ల బాలికపై సాజిద్‌ అనే వ్యక్తి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలుడిని హతమార్చారు

ఇటీవల కనిపించకుండా పోయిన ఉదయ్ కిరణ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు. ఉదయ్ బాబాయే ఈ ఘటనలో నిందితుడని పోలీసులు తేల్చారు.

Youth convicted for raping a 12 year old girl

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాటసింగారంలో 7వ తరగతి చదువుతున్న ఉదయ్‌ని తన స్నేహితుల సహకారంతో కిడ్నాప్ చేసి, గొంతునులిమి హత్య చేసినట్టు నవీన్ అంగీకరించాడు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు.

ముత్తంగి ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు మండలం ముత్తంగి ఎస్‌బీఐ బ్యాంకులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఫర్నీచర్‌, ఫైళ్లు, కంప్యూటర్లతో పాటు జిల్లాలోని జన్‌ధన్‌ యోజన ఫైళ్లూ అగ్నికి ఆహుతయ్యాయి.

కుషాయిగూడలో పగిలిన మంజీరా పైప్‌లైన్‌

హైదరాబాద్‌ నగరంలోని కుషాయిగూడ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర మంజీర పైప్‌లైన్‌ పగిలింది. దీంతో మంచినీరు వృథాగా వెళుతోంది. అయితే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+