జగన్ బస్సుయాత్రలో వైఎస్ భారతి
సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు భార్య భారతి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా తాడేపల్లి జంక్షన్ వద్దకు చేరుకున్న జగన్‌కు భారతి అభివాదం చేశారు. ప్రతిగా బస్సులో నుంచి భార్యకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి వైఎస్.భారతి అభివాదం చేశారు.
తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి..!!#YSJagan #YSBharathi #MemanthaSidddham #YSRCP #Once pic.twitter.com/kWn9Q8oWJu
— oneindiatelugu (@oneindiatelugu) April 13, 2024
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. కనక దుర్గమ్మ వారిది మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర అడుగుపెట్టింది. సీఎం జగన్‌కు జిల్లా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు జగన్‌కు స్వాగతం పలికారు. మరోవైపు గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర ముగించుకున్న సమయంలో జిల్లా నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో జగన్ చర్చించారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా పని చేయాలని నాయకులకు జగన్ దిశానిర్ధేశం చేశారు.













Click it and Unblock the Notifications