అందులో భారతి ప్రమేయం; ఒకే రాయి జగన్, వెల్లంపల్లి ఇద్దరికెలా తగిలింది: రఘురామ లాజిక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై ఇంకా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసలు రాయి దాడి ఎలా జరిగింది? ఎవరు ఎలా ఎందుకు చేశారు? అన్నదానిపై ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు.
జగన్ పై రాయి దాడి ఘటన.. టీడీపీ వర్సెస్ వైసీపీ
ఒకపక్క వైసిపి టిడిపి ఆధ్వర్యంలోనే రాయి దాడి జరిగిందని, జగన్ కు వస్తున్న ప్రజల మద్దతు చూసి తట్టుకోలేక ఈ తరహా కుట్రలకు తెర తీశారని తెలుగుదేశం పార్టీపై ఆరోపిస్తుంది. తెలుగు తమ్ముళ్లు రాయి దాడి ఘటనపై బోలెడు లాజికల్ ప్రశ్నలు వేస్తూ ఇదంతా సానుభూతి కోసం జగన్ , జగన్ పార్టీ సభ్యులు ఆడుతున్న డ్రామా అని ఎదురుదాడి చేస్తున్నారు.

ఒకే రాయి ఇద్దరికెలా తగిలింది?
ఇక తాజాగా నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమవరం లోని తన నివాసంలో రచ్చబండ నిర్వహించిన ఆయన ఎవరో వేసిన ఒకే ఒక గులకరాయి సీఎం జగన్మోహన్ రెడ్డి నుదుటికి , వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలిందని, అది ఎలా సాధ్యం అంటూ లాజికల్ గా ప్రశ్నించారు.
చిన్న గాయానికి 16 మంది వైద్యులు, 26 మంది నర్సుల వైద్యం
శత్రువులు అంతా కలిసికట్టుగా వచ్చి తనను ఒంటరిని చేసి పంగలి కర్రతో రాయి వేసి కొడితే నేను భయపడతానా.. నా వెనుక జనం ఉన్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 16 మంది వైద్యులు, 26 మంది నర్సులు బృందంతో జగన్ కు నుదుటిపై తగిలిన చిన్న గాయానికి కుట్లు కుట్టించుకోవాల్సిన అవసరం ఉందా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
జగన్ సతీమణి భారతి పై సంచలన వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సునీత చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పుడు సూత్రధారి విచారణ పూర్తయితే పాత్రధారి కావచ్చు
ఆమె విలేకరుల సమావేశంలో చెప్పిన నిజం ఇదేనని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో భారతి ప్రమేయం ఉందని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తయితే ప్రస్తుతం సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రధారిగా మారతారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications