గిడ్డి ఈశ్వరి కోసం రంగంలోకి భారతి: వారు ఇంటికెళ్లినా నో, ఆధారాలతో దిమ్మతిరిగే షాక్
వైసీపీ నుంచి సోమవారం టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆపేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి కూడా రంగంలోకి దిగారా? ఆమె ప్రయత్నాలు కూడా ఫలప్రదం కాలేదా?
అమరావతి: వైసీపీ నుంచి సోమవారం టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆపేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి కూడా రంగంలోకి దిగారా? ఆమె ప్రయత్నాలు కూడా ఫలప్రదం కాలేదా? అంటే ఈశ్వరి మాటలను చూస్తే అవుననే అంటున్నాయి.
Recommended Video

చదవండి: జగన్‌ను వేడుకున్నా కనికరించలేదు, గెంటేశారు: గిడ్డి ఈశ్వరి షాకింగ్
గిడ్డి ఈశ్వరి సోమవారం మధ్యాహ్నం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు అన్ని విషయాలను చెప్పానని తెలిపారు. జగన్ వినకపోవడం వల్లే తాను వైసీపీని వీడవలసి వచ్చిందని ఆమె తేల్చి చెప్పారు.
చదవండి: వైసీపీనే గెలుస్తుంది: గిడ్డి ఈశ్వరి ఆసక్తికరం, టిడిపిలో చేరికకు మరో ఆసక్తికర కారణం

గిడ్డి ఈశ్వరితో భారతి మంతనాలు
ఆదివారం సాయంత్రం తనతో వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి రెడ్డి మాట్లాడారని గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. అయితే సమస్యను పరిష్కరించకుండా ఎవరు ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం లేదని ఈ సందర్భంగా ఈశ్వరి అనడం గమనార్హం.

భారతిని రంగంలోకి దింపిన జగన్
తద్వారా, గిడ్డి ఈశ్వరిని వైసీపీలోనే ఉంచేందుకు భారతి కూడా ప్రయత్నాలు చేశారు. అప్పటికే రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, ధర్మశ్రీ తదితరులు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ వినలేదు. దీంతో ఏకంగా భారతి రెడ్డిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. కానీ అది కూడా ఫలితం లేకుండా పోయింది.

జగన్ నన్ను పిలిచి చెప్పారు
జగన్ తనను పిలిచి పాడేరుకు మాత్రమే పరిమితం కావాలని సూచించారని గిడ్డి ఈశ్వరి వాపోయారు. అరకుతో నాకు సంబంధం లేదని చెప్పారన్నారు. దీంతో తాను మనస్తాపానికి గురైనట్లు ఆమె అభిప్రాయపడ్డారు. తాను పార్టీ కోసం పని చేస్తే, జగన్ తనను పక్కన పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు.

విలువలేని చోట ఉండలేనని కఠిన నిర్ణయం
తనకు విలువలేని చోట ఉండలేనని, అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాలనే తెగింపుకు వచ్చేశానని గిడ్డి ఈశ్వరి చెప్పారు. ఇదే విషయాన్ని తాను జగన్‌కు, విజయసాయి రెడ్డికి తేల్చి చెప్పానన్నారు. పార్టీని వీడకుండా తనను బుజ్జగించాలని చూశారన్నారు.

ఎలా బుజ్జగించారంటే
కాగా, వైసీపీ తమ ప్రయత్నంలో భాగంగా గిడ్డి ఈశ్వరికి శనివారం ఫోన్ చేసి పార్టీని వీడవద్దని కోరారు. అయితే తాను విశాఖలో ఉన్నానని, కేఆర్ఎం కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఇంటికి ఓసారి రావాలని కోరారు. కానీ గిడ్డి మాత్రం ససేమీరా అన్నారు. రాత్రి విజయసాయి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినప్పుడు బుజ్జగింపులు ప్రారంభిస్తే ఆమె నో చెప్పారు.

రవిబాబుకు ఎవరూ హామీ ఇవ్వలేదు
రవిబాబు పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ప్రతిపాదన ఉందని, కానీ ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ పైన తాను లేదా జగన్ హామీ ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని విజయసాయికి చెప్పానన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు చూపించగా.. విజయసాయి దానిని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చారు.

ఆ హామీ మాత్రమే ఉందని ఆధారాలు చూపిన గిడ్డి
కాగా, రవిబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ లేదని, ఎమ్మెల్సీ హామీ మాత్రమే ఉందని కొయ్యడప్రసాద్ రెడ్డి చెప్పినట్లుగా ఉన్న వీడియోను గిడ్డి ఈశ్వరి.. విజయసాయికి చూపించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లినా నో చెప్పిన గిడ్డి
ఆ తర్వాత విజయసాయి.. ఈశ్వరి బాధ్యతను కొయ్యడకు అప్పగించారని తెలుస్తోంది. దీంతో కరణం ధర్మశ్రీ వంటి నేతలు ఆదివారం ఆమె వద్దకు వెళ్లారు. తాను రెండు నెలల క్రితమే రవిబాబును పార్టీలోకి తీసుకోవద్దని జగన్‌కు చెప్పానని ఈశ్వరి వారికి సూటిగా చెప్పారని తెలుస్తోంది. తాను టీడీపీలో చేరుతానని ఖరాఖండిగా చెప్పారని సమాచారం.
చదవండి: టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి: జగన్‌పై సంచలనం, బాబు తల నరుకుతానని ఎందుకన్నానంటే..
చదవండి: జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications