YSRCP Incharges Change: వైసీపీ ఇన్ ఛార్జ్ ల ఎనిమిదో లిస్ట్ రెడీ ! ఈసారి జాబితాలో వీరేనా ?

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఇందులో భాగగా ఇప్పటికే ఏడు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ హైకమాండ్.. ఇప్పుడు ఎనిమిదో జాబితా విడుదల కోసం కసరత్తు చేస్తోంది. ఇందులోనూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే నియమించిన ఇన్ ఛార్జ్ ల సీట్లు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదో జాబితాలో ఉండబోయే ఎమ్మెల్యేలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

వైసీపీ ప్రకటించే ఎనిమిదో లిస్టులో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్దానంలో మరో కొత్త ఇన్ ఛార్జ్ ను నియమించబోతున్నారు. ఈ మేరకు నిన్న హఫీజ్ ఖాన్ ను, ఆయన తండ్రి మోయిజ్ ఖాన్ ను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్ మార్పులపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో హఫీజ్ ఖాన్ కూడా సీఎం జగన్ నిర్ణయం ప్రకారమే ఎవరిని నియమించినా గెలిపించేందుకు సిద్ధమని చెప్పేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు సిటీలో వైసీపీ నేత ఇలియాజ్ బాషా పేరును ప్రకటించే అవకాశం ఉంది.

ys jagan all set to release 8th list of ysrcp incharges- here are likely changes

అలాగే నెల్లూరు సిటీ సీటులో ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ స్ధానంలో మరో ఇన్ ఛార్జ్ ను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఖలీల్ నియామకంపై ఆగ్రహంతో ఏకంగా ఎంపీ, కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. దీంతో నెల్లూరు సిటీ స్ధానంలో నటుడు అలీని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. తనకు ఏ సీటు ఇచ్చినా పోటీకి సిద్దమని అలీ కూడా సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

మరోవైపు నిన్న సీఎం జగన్ ను జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా కలిశారు. జగ్గయ్య పేట స్ధానంలో సామినేని స్ధానంలో బీసీలకు అవకాశం ఇస్తే ఉంటుందన్న దానిపై ఆయనతో జగన్ చర్చలు జరిపి ఉంటారని తెలుస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభానును తప్పిస్తే ఎదురయ్యే పరిణామాలపై అధిష్టానం చర్చిస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.

మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా ఈ మధ్యే సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. బందరు ఎంపీ సీటులో తాజాగా మారిన పరిణామాల్లో జనసేన తరఫున వైసీపీ మాజీ ఎంపీ బాలశౌరి ఉమ్మడి అభ్యర్ధఇగా బరిలోకి దిగబోతున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సరిపోరు. దీంతో టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పార్టీలోకి తెచ్చి అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తున్నారు. దీనిపై నాని, వంశీతో చర్చించినట్లు తెలుస్తోంది. కొనకళ్ల రాకపోతే మంత్రి అంబటి రాంబాబును బందరు ఎంపీగా నిలబెట్టవచ్చని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+