ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనున్న జగన్- రూ.1,000 కోట్లతో

అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్‌లో ఉంటోన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో తీరిక లేకుండా గడిపిన ఆయన జిల్లాల పర్యటనలను మళ్లీ పట్టాలెక్కించారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన బాపట్ల, ఆ తరువాత తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. కమలాపురం, పులివెందులల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరి కొన్నింటిని ప్రారంభించారు.

ఇక ఉత్తరాంధ్రకు బయలుదేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 1,000 కోట్ల రూపాయల అంచనాతో తలపెట్టిన ప్రాజెక్టులవి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. దీని నిర్మాణ వ్యయం 500 కోట్ల రూపాయలు.

YS Jagan all set to visit Narsipatnam in Anakapalli district on December 30, here is the reason

ఇప్పటికే- 8,000 కోట్ల రూపాయలతో 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బయలుదేరి వెళ్తారు. ఉదయం 10.25 నిమిషాలకు నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని బలిఘట్టానికి చేరుకుంటారు. జోగునాథునిపాలెం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.25 నిమిషాలకు అక్కడినుంచి బయలుదేరి మూడు గంటలకు తాడేపల్లికి చేరుకుంటార

కాగా- రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం.. నర్సీపట్నం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సొంత నియోజకవర్గం. ఆరుసార్లు ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో 23 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాంటి చోట మెడికల్ కాలేజీ సహా పలు అభివృద్ధి పనులకు స్వయంగా ముఖ్యమంత్రి చేపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+