ఎన్టీఆర్ మొదటి భార్య బంధువే చెప్పారు.. అంతా కలిసి వేధిస్తున్నారట: భూకబ్జాలపై జగన్

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూ కబ్జాలు, అవినీతి పెచ్చరిల్లిందన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో పార్కులు, శశ్మానాలు, ఆఖరికి పబ్లిక్ టాయిలెట్లను కూడా టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ ఆగడాలు మరింత ఎక్కువగా ఉన్నాయని, స్థానిక మహిళలు వాటి గురించి చెబుతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 150వ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం బహిరంగ సభలో మాట్లాడారు జగన్.

25మంది ఎంపీలను గెలిపించండి..:

25మంది ఎంపీలను గెలిపించండి..:

'నాలుగేళ్లుగా కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా చంద్రబాబు మోసం చేశాడు.. అందరినీ నమ్మి నమ్మి అలసిపోయాం.. ఇక చాలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి ఢిల్లీని శాసించే బలం ఇవ్వండి. 25కి 25ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా.. చంద్రబాబే దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారు.' అని జగన్ ఫైర్ అయ్యారు.

రాత్రికే రాత్రే నోటిఫికేషన్..:

రాత్రికే రాత్రే నోటిఫికేషన్..:


'నాన్నగారు మచిలీపట్నంలో పోర్టుకు శంకుస్థాపన చేసి గొప్ప పని చేశారు. ఇందుకు 4,800 ఎకరాలు సేకరించాలనుకున్నారు. కానీ ఆరోజు ఇక్కడున్న టీడీపీ నేతలు, చంద్రబాబు.. అందుకు అభ్యంతరం తెలిపారు. 4,800 ఎకరాల భూమి పోర్టుకు చాలా ఎక్కువ అని, 1,800 ఎకరాలు సరిపోతుందని గొడవకు దిగారు.

కానీ చంద్రబాబు సీఎం అయ్యాక సీన్ మారింది. 4,800 ఎకరాల్లో బంగారం లాంటి పోర్టు నిర్మించాల్సింది పోయి, అవసరం లేకున్నా.. కనీసం ఎవరితోనూ చర్చించకుండా.. రాత్రికి రాత్రే బందరు పట్టణం పక్కనే పోర్టు, దానికి ఆనుకుని 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. చీకట్లో దొంగల మాదిరిగా నోటిఫికేషన్‌ పత్రాలను గ్రామాల్లో వెదజల్లి పోయారు.' అని జగన్ ఆరోపించారు.

ఎన్టీఆర్ మొదటి భార్య బంధువు..:

ఎన్టీఆర్ మొదటి భార్య బంధువు..:

మచిలీపట్నం నియోజకవర్గంలో అడుగు పెట్టగానే చాలా మంది రైతులు, మహిళలు, అన్నాదమ్ములు నా వద్దకు వచ్చి తమ గోడు వినిపించారు. పార్కులు, శ్మశానాలను, బహిరంగ టాయిలెట్లను కూడా వదలకుండా నాయకులు, మంత్రులు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిన్న నావద్దకు శివలీలమ్మ అనే పెద్దావిడ వచ్చారు. ఆమె ఎన్టీఆర్ గారి మొదటి భార్య బసవతారకం బంధువు. బందరులో ఉన్న ఆమె భూములను తక్కువ రేటుకు విక్రయించాలని కొంతమంది బెదిరిస్తున్నారట.

తక్కువ రేటుకు అమ్మాలని వేధింపులు..:

తక్కువ రేటుకు అమ్మాలని వేధింపులు..:

'తక్కువ రేటుకు విక్రయించడానికి ఆమె ఒప్పుకోనందుకు పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వేధించారట. నాలుగు రోజుల పాటు పోలీసు స్టేషన్లు, లాడ్జీలు, వేరే ఇళ్లలోనూ పెట్టి వేధించారని ఆమె తన బాధ చెప్పుకున్నారు. తన కుమారుడిని, అతని భార్యను, పిల్లలను తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో నాలుగు రోజులుగా పెట్టారట.

పొద్దున పూట స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి పూట మరోచోటుకు మారుస్తారట. మళ్లీ తెల్లవారాక స్టేషన్‌కు తీసుకొస్తారు. మళ్లీ రాత్రికి వారి చేతనే హోటళ్లలో రూం బుక్‌ చేయించి అక్కడ పెట్టిస్తున్నారని ఆమె చెప్పారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా పోలీసులే వేధిస్తున్నారని బసవతారకం గారి బంధువే చెబుతుంటే.. పోలీసులు, మంత్రులు, ఎంపీలు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోండి' అని జగన్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+