జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. కేంద్రంలో మారుతున్న లెక్కలతో..

ఏపీలో రాజకీయాలు కొన్నేళ్లుగా కేంద్రం చుట్టే తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు వచ్చాయంటే చాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదని ఏపీలో పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీతో అంటకాగుతూ ఎన్నికల తీరం దాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా అధికారానికి దూరమవుతాయని భయపడుతున్నాయి. ఇందుకు విరుద్ధంగా వెళ్లి 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న చంద్రబాబు ఈసారి అప్రమత్తమయ్యారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు వెల్లడించాయి. అయితే విపక్షాలు కూడా ఇండియా ఫ్రంట్ పేరుతో ఏకమై రాజకీయానికి పదునుపెడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన ఇండియా కూటమి.. వచ్చే నెలలో ముంబైలో మూడో సమావేశం నిర్వహిస్తోంది. దీంతో ఇండియా కూటమికి కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత సీన్ మారుతోంది. అయితే ఏపీలో రాజకీయ పార్టీలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు.

ys jagan and chandrababu opt different tactics amid change in political scenario at centre

గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీకి మిత్రులుగా మారిపోయిన వైసీపీ, టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా మారుతున్న విపక్షాల లెక్కల్ని ఏమాత్రం పట్టించుకునే పరిస్ధితుల్లో లేవు. తాజాగా ఢిల్లీలో చంద్రబాబు దక్షిణాదిన ఇండియా కూటమి ప్రభావం లేదని తేల్చేశారు. కర్నాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఉనికి ఉందన్నారు. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షంగా కాంగ్రెస్ ఉన్న విషయాన్ని, కేరళలో ఇండియా కూటమి పార్టీ సీపీఎం అధికారంలో ఉన్న విషయాన్ని వదిలేశారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ మాత్రం ఎన్డీయే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలోలా తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడం లేదు. ఏపీ బీజేపీ ఛీఫ్ గా పురందేశ్వరి వచ్చాక ఆ పార్టీపై వైసీపీ నేతలతో విమర్శలు చేయిస్తున్నారు. మరోవైపు గతంలో నెత్తిన పెట్టుకున్న ఎన్డీఆర్ స్మారకంగా ఢిల్లీలో కాయిన్ రిలీజ్ చేస్తే ఆ కార్యక్రమానికి తమ పార్టీ నేత లక్ష్మీపార్వతిని ఆహ్వనించకపోయినా పట్టించుకోలేదు. ఈ విషయంలో బీజేపీపై విమర్శలు చేస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించారు. అలాగే ఎన్నికలు సమీపించే కొద్దీ బీజేపీకి దూరం జరుగుతూ ,తాము తటస్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రేపు కేంద్రంలో అధికారంలోకి ఎవరు వచ్చినా తనకు నష్టం లేకుండా చూసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+