పరామర్శ, కీలక హామీ- పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం..!!
మాజీ సీఎం జగన్ ఒంగోలు పర్యటించారు. ఇటీవల మరణించిన పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు.. కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ పార్టీకి చేసిన సేవలను జగన్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పై తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కాగా.. స్థానిక ఎన్నికల సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజశేఖర్ కుటుంబ సభ్యలకు జగన్ ధైర్యం చెప్పారు. రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. జగన్ ఒంగోలు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కాగా.. స్థానిక ఎన్నికల పైనా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. రేపు (బుధవారం) పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. స్థానిక ఎన్నికల ను సీరియస్ గా తీసుకున్న జగన్.. కొత్త వ్యూహాల పై స్పష్టత ఇవ్వనున్నారు.

పార్టీ ముఖ్య నేతలకు జగన్ దిశా నిర్దేశం
ఇప్పటికే స్థానిక ఎన్నికల పైన జగన్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్ధి బరిలో లేకపోతే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని జగన్ తేల్చి చెప్పారు. ఇక.. అభ్యర్ధుల ఖరారు విషయంలోనూ కీలక సూచనలు చేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపిక చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లు.. ప్రాంతీయ సమన్వయకర్తలు అభ్యర్ధులకు అన్ని రకాలుగా అండగా నిలవాలని నిర్దేశించారు. అదే విధంగా రాష్ట్రంలో నెలకున్న ప్రజా సమస్యల పైనా ఎక్కడికి అక్కడ స్థానిక నాయకత్వం స్పందించాలని సూచిస్తున్నారు. దీంతో.. రేపు జరిగే పార్టీ నేతల సమావేశంలో జగన్ వెల్లడించే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
