జైలు నుండి వచ్చాక మొదటిసారి సిబిఐ కోర్టుకు జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానానికి వచ్చారు. జగన్ ఉదయం తన నివాసం నుండి బయలుదేరారు.
పదిన్నర గంటలకు కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పొందిన తర్వాత మొదటిసారి కోర్టుకు వచ్చారు. సెప్టెంబర్ 23వ తేదిన జగన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు జగన్ హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. జగన్‌ను చూసేందుకు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు గుమికూడారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా జగన్ ఆస్తుల కేసులో కోర్టుకు హాజరయ్యారు. మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నందున రాలేదు. జగన్, సబితలు కోర్టుకు హాజరైన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications