వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు .. వాటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ : పంచుమర్తి అనురాధ

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో ఏపీ సిఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేయడంపై టిడిపి మహిళా నాయకురాలు, టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని నోటీసులిచ్చారు అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతి పై జగన్ రెడ్డి విషం కక్కుతున్నారు అంటూ మండిపడ్డారు.

జగన్ నియంత పాలన, చంద్రబాబును జైలుకు పంపే ఆలోచనతోనే కుట్ర : నోటీసులపై టీడీపీ నేతల ఫైర్జగన్ నియంత పాలన, చంద్రబాబును జైలుకు పంపే ఆలోచనతోనే కుట్ర : నోటీసులపై టీడీపీ నేతల ఫైర్

చంద్రబాబు ఎం తప్పు చేశారని నోటీసులు .. నిలదీసిన అనురాధ

చంద్రబాబు ఎం తప్పు చేశారని నోటీసులు .. నిలదీసిన అనురాధ

జగన్ తాను జైలుకు వెళ్ళాడు కాబట్టి అందరినీ జైలుకు పంపించాలని భావిస్తున్నారని పంచుమర్తి అనురాధ అభిప్రాయపడ్డారు. 16 నెలల కాలం జైలు జీవితం గడిపిన 11 చార్జిషీట్లు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక ఉదాహరణ అని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టటమంటే తెలుగువారిని అవమానించడమేనని అనురాధ పేర్కొన్నారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని ప్రశ్నించిన అనురాధ, రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్మించాలని అనుకోవడమేనా ఆయన చేసిన నేరమంటూ నిలదీశారు.

 ఇన్ సైడర్ ట్రేడింగ్ , క్విడ్ ప్రోకో లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

ఇన్ సైడర్ ట్రేడింగ్ , క్విడ్ ప్రోకో లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

అసైన్డ్ రైతులకు సామాన్య రైతులకు సమానంగా ప్యాకేజీ ఇవ్వడమేనా ఆయన చేసిన తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ , క్విడ్ ప్రో కో గురించి జగన్మోహన్రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనురాధ. ఇన్ సైడర్ ట్రేడింగ్, క్విడ్ ప్రో కో రెండింటికీ జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు . చంద్రబాబు ని ఎదుర్కోవడం వైయస్ వల్ల కాలేదని, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.

 తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు

తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు


తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని తేల్చి చెప్పారు . జగన్ రెడ్డి తన చర్యలతో రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారు అని పంచుమర్తి అనురాధ విమర్శించారు. జగన్ క్రిమినల్ బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న అనురాధ గతంలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు అనే విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలి అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వచ్ఛమైన వ్యక్తని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 విచారణ కమిటీలు వేసినా చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటపడ్డాడని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా ?

ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా ?

ఏ ఆధారంతో చంద్రబాబు కు సీఎం నోటీసు ఇచ్చారు చెప్పాలన్నారు. అగ్రకులానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా అంటూ నిలదీశారు. చంద్రబాబు పై పెట్టిన కేసులపై వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
జగన్ కక్ష సాధింపు చర్యలకు తాజా పరిణామాలు పరాకాష్ట అని పంచుమర్తి అనురాధ అభిప్రాయం వ్యక్తం చేశారు .

English summary
TDP women leader and TDP general secretary Panchumarthi Anuradha was outraged that AP CID officials had issued notices to TDP chief Chandrababu Naidu over the insider trading in the capital Amaravati. Anuradha asked what chandrababu had done wrong. Jagan Reddy has been criticized for poisoning the capital Amaravati. Jagan Reddy has been criticized as a brand ambassador for both insider trading and Quid Pro quo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X