జగన్ పార్టీ ప్రక్షాళన షురూ - నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రక్షళన ప్రారంభించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తీసుకోవాల్సిన చర్యలను మొదలు పెట్టారు. క్షేత్ర స్థాయి నుంచి అవసరమైన మార్పుల పైన అధ్యయనం చేసారు. అందులో భాగంగా ముందుగా రెండు నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్పు చేసారు. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఎన్నికల ఇంఛార్జ లను మార్పు చేసి ప్రయోగం చేసారు. ఇప్పుడు పొరపాట్లు సని చేసుకుంటున్నారు. తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జగన్ తాజా నిర్ణయం
ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. దాదాపు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల సమయంలో మార్పు చేసారు. కొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేసారు. కేడర్, పార్టీకి జగన్ దూరంగా ఉండటంతో ఎన్నికల పైన ఆ ప్రభావం పడింది. దీంతో..ఇప్పుడు కేడర్ కోసం జిల్లాల పర్యటనలకు వెళ్తున్న జగన్..పార్టీ పరంగానూ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతల దాడుల్లో గాయపడిన వారిని జగన్ పరామర్శిస్తున్నారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు.

YS Jagan Changes party incharges for Assembly Constituencies in Krishna District

ఇంఛార్జ ల మార్పు
మాజీ మంత్రి జోగి రమేష్ ను తిరిగి మైలవరం ఇంఛార్జ్ గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత క్రిష్ణప్రసాద్ గెలుపొందారు. తాజా ఎన్నికల వేళ ఆయన టీడీపీలో చేరారు. అక్కడ ఆ సమయంలోనే తిరిగి జోగి రమేష్ కు సీటు కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, జగన్ ఆ సమయంలో పెనమలూరు నుంచి జోగి రమేష్ ను బరిలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. దీంతో, ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోనూ మార్పులు చేసారు.

పార్టీ ప్రక్షాళన దిశగా
జోగి రమేష్ ను మైలవరం ఇంఛార్జ్ గా తిరిగి నియమించిన జగన్..పెనమలూరు ఇంఛార్జ్ గా దేవభక్తుని చక్రవర్తికి బాధ్యతలు ఖరారు చేసారు. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల నుంచి కింది స్థాయి వరకు అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధుల కోసం కొత్త టీం ను సిద్దం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జగన్ వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+