ఎన్నికలు టార్గెట్: అశోక్‌బాబుకు జగన్ చెక్ చెబుతారా?

YS Jagan check to Ashok Babu
హైదరాబాద్: సమైక్య ఉద్యమ నేత, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు చెక్ పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారట. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి అశోక్ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉద్యోగుల తరఫున సారథ్యం వహిస్తున్నారు.

తనదైన శైలిలో ఉద్యమానికి ఆయన ఊపు తెచ్చారు. ఈ ఉద్యమంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న జగన్.. అశోక్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే క్రమంలో చాపకింద నీరులా వ్యవహరిస్తున్న జగన్ పార్టీ నేతలు ఎఫిఎన్జీవో సంఘానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో అశోక్ బాబును, ఆయన వర్గాన్ని ఓడించడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి వారిని తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు.

విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని సొంతం చేసుకునేందుకు, ఆ క్రమంలో ఉద్యోగులను తమవైపునకు తిప్పుకొనేందుకు, ఉద్యమ సారథ్య ఘనతను కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారట. అందులో భాగంగా తమతో కలిసి రావల్సిందిగా సంఘం నేతలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలుమార్లు విజ్ఞ్ఞప్తులు కూడా చేశారు.

దీనికి అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి ససేమిరా అన్నారు. దీంతో జగన్ రంగంలోకి దిగి కొందరిని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారంట. ఇందులో భాగంగానే ఇటీవల కొందరు అశోక్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+