వైసీపీకి తీరిన ఆ ఎంపీ సీటు బెంగ ! అభ్యర్ధిగా మాజీ మంత్రి-త్వరలో జనంలోకి..
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు పలు చోట్ల కలకలం రేపింది. ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఓ ఎంపీ స్ధానం నుంచి మరో చోటికి వెళ్లాలని కోరడంతో సదరు సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్టీకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ సీటులో ఎవరిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్న సీఎం జగన్ కు తాజాగా తట్టిన ఓ ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితేనేం వైసీపీకి మాత్రం ఆ ఎంపీ సీటులో అభ్యర్ధి బెంగ మాత్రం తీరినట్లే కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ఎంపీ సీట్లలో పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చే కీలకమైన నరసరావుపేట స్ధానం కూడా ఒకటి. ఇక్కడి రాజకీయ, కుల సమీకరణాల నేపథ్యంలో అభ్యర్ధిని ఎంచుకోవడం పార్టీలకు అంత సులువు కాదు. అయితే ఓ ప్రయోగం చేద్దామని గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయల్ని జగన్ నరసరావుపేట ఎంపీ సీటులో బరిలోకి దింపి గెలిపించుకున్నారు. అయితే అప్పట్లో వైసీపీ హవాలో గెలిచిన లావు.. మరోసారి అక్కడ గెలవలేరనే నిర్ణయానికి జగన్ వచ్చేశారు. దీంతో బీసీ అభ్యర్ధి వైపు ఆయన దృష్టి మళ్లింది.

నరసరావుపేట స్ధానంలో వైసీపీ తరఫున కొత్తగా బీసీ అభ్యర్ధిని తీసుకొస్తే కుదురుకోవడానికి సమయం పడుతుంది. దీంతో పార్టీలో ఉన్న మంత్రి విడదల రజనీతో పాటు మరికొన్ని ఆప్షన్లను జగన్ పరిశీలించారు. చివరికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిన్న అనిల్ యాదవ్ సీఎం జగన్ ను వచ్చి కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కు ఈసారి నరసరావుపేట సీటులో పోటీ చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సరేనన్నారు.
అనిల్ యాదవ్ ను నరసరావుపేట నుంచి బరిలోకి దింపడం ద్వారా అక్కడ భారీ సంఖ్యలో ఉన్న బీసీ ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నింటికంటే మించి విధేయుడైన అనిల్ యాదవ్ ను నరసరావుపేట నుంచి గెలిపించుకుంటే ఈ సీటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో బీసీ అభ్యర్ధి లేడనే సమస్య కూడా తీరిపోతుంది. దీంతో త్వరలో అనిల్ ను అక్కడి ఎమ్మెల్యేలకు పరిచయం చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications