బలం లేకున్నా, పరిటాల సునీత దౌర్జన్యం చేయాలని..: డిజిపికి జగన్ లేఖ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఏపీ డీజీపీ సాంబశివ రావుకు లేఖ రాశారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఏపీ డీజీపీ సాంబశివ రావుకు లేఖ రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార టిడిపి దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఐజీ గుప్తాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని గౌతమ్ రెడ్డి ఈ లేఖను అందించారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల విషయంలో వైసిపి నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి జగన్ రాసిన లేఖను అందించారు.

YS Jagan complaints to DGP against paritala Sunitha

కనగానపల్లి ఎంపీపీ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని వారు ఎన్నికల కమిషనర్‌ను కోరారు. మంత్రి పరిటాల సునీత దౌర్జన్యాలకు పాల్పడాలని చూస్తున్నారని, బలం లేకున్నా ఎంపీపీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని వైసిపి నేతలు పార్థసారథి, కవిత, కన్నబాబులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+