చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
ఏపీలోని అనకాపల్లిలో ఇవాళ జరిగిన వైసీపీ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా చంద్రబాబు ఈ మధ్య చేసిన బచ్చా కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. "చంద్రబాబూ నేను బచ్చా అయితే ఆ బచ్చా మీద కేవలం 23 ఎమ్మెల్యేలను మాత్రమే గెలిచి ఎందుకు ఓడిపోయావ్" అని జగన్ ప్రశ్నించారు. "ఈ బచ్చా మీద ఒంటరిగా రాలేక ఆరడజను మందిని వెంటేసుకుని ఎందుకు వస్తున్నావ్".. అని అడిగారు.
రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలంట.. మంచి చేసి మీ బిడ్డ ఓట్లు అడుగుతుంటే.. మోసం చేసి చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. సిద్ధం సభలను ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని,
చంద్రబాబు ఉక్రోశంతో తనపై రాళ్లు వేయమని చెబుతున్నారన్నారు. తనను దగ్ధం చేయమంటున్నారని ఆక్షేపించారు.
ఇదే దత్తపుత్రుడు, చంద్రబాబు వదినమ్మ అజెండా.. జగన్ కొట్టడానికి, హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి పంచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట అన్నారు.

చంద్రబాబు ఈ మధ్య మాట్లాడుతూ జగన్ ఓ బచ్చా అన్నారని, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడుతో పాటు పూతన, కాళిందిలను సైతం కాలి కింద వేసుకుని నాట్యం చేశారని జగన్ అన్నారు. రాముడిని బచ్చా లనుకున్న మారీచుడు, సుభాహుడు తరహాలోనే ఈ రోజు రామోజీ, రాధాకృష్ణ కనిపిస్తున్నారన్నారు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ అటువైపు హీరోలందరూ బచ్చాల మాదిరిగానే కనిపిస్తారన్నారు.

అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల కోసం ధైర్యంగా ప్రజల మందుకు వస్తున్నాను. పేదలకు నువ్వు మంచి చేసుంటే ఈ బచ్చాలను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడావు అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకయ్యా మీకు ఇంత భయం ఈ బచ్చా అంటే అని అడిగారు.తాను బచ్చా అయితే ఐదేళ్ల తరువాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కడివే రావడానికి ధైర్యం లేదన్నారు.












Click it and Unblock the Notifications