చంద్రబాబే కారణం - వరదలపై జగన్ తాజా అల్టిమేటం..!!
విజయవాడ వరదలకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ముందుగా వర్షాలపై హెచ్చరికలు ఉన్నా సమీక్షలు చేయకుండా..యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా ఆయన నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. తన ఇంట్లోకి నీరు రావటంతోనే కలెక్టరేట్ లో బస చేసి ప్రజల కోసం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పటంతో పాటుగా మరణించిన కుటుంబాలకు రూ 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసారు.
జగన్ పర్యటన
విజయవాడ రాజరాజేశ్వరి నగర్ లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. వరద అంచనాలో..సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన ఇంటి వద్దకు వరద నీరు రాకుండా అడ్డుకొనేందుకు అర్ద్రరాత్రి బుడమేరు వరద నీటిని విజయవాడ వైపు మళ్లించారని విమర్శించారు. తన ఇంట్లో నీరు వస్తే వచ్చి కలెక్టరేట్ లో పడుకున్నారని వ్యాఖ్యానించారు. ఇంత వరద వస్తే ఎక్కడా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయలేదన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి అధికారుల పైన నెపం మోపుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు వైఫల్యం
గత బుధవారం నుంచి తుఫాను పైన హెచ్చరికలు వస్తే చంద్రబాబు సమీక్షలు ఎందుకు చేయలేదని జగన్ నిలదీసారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం పైన ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని..వస్తున్న వరద ఆధారంగా ముందస్తు నిర్ణయాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.ముందస్తుగానే అధికార యంత్రాగానికి బాధ్యతలు అప్పచెప్పి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. చంద్రబాబు తన ఒప్పుకొని బాధిత కుటుంబలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తమ హాయంలో వరదలు వస్తే ఆర్బాటాలకు పోకుండా అధికారులు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో సేవలు అందిచామన్నారు.
రూ 25 లక్షలు ఇవ్వాలి
బుడమేరు మీద వెలగేరు రెగ్యులేటరీ మీద లాక్స్ ఎవరి ఆదేశాలతో ఎత్తారో చెప్పాలని జగన్ డిమాండ్ చేసారు. ఆ కారణంగానే విజయవాడకు వరద వచ్చిందనన్నారు. చంద్రబాబు కారణంగానే 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. గతంలో ప్రచారం కోసం రాజమండ్రిలో పుష్కరాల సమయంలో 29 మందిని బలి గొన్నారని గుర్తుచేసారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరదలు కావటంతో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ కుటుంబానికి రూ 25 లక్షల పరిహారం...నష్టపోయిన ప్రతీ ఇంటికి రూ 50 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications