జగన్ డిశ్చార్జ్, హైదరాబాద్‌కు: ఆస్పత్రి వద్ద ‘జై జగన్’ అంటూ అభిమానులు(పిక్చర్స్)
హైదరాబాద్/గుంటూరు: జీజీహెచ్‌లో రెండు రోజులుగా చికిత్స పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జగన్‌ను మంగళవారం తెల్లవారుజామున చికిత్స నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
మిలీనియం బ్లాక్ ప్రాంగణంలోని రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను బుధవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వైద్యులు డిశ్చార్జి చేశారు. జగన్‌ను డాక్టర్లు ఇంటికి పంపంచి వేస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు గుంటూరు ఆస్పత్రి వద్దకు చేరుకుని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన జగన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం కారులో హైదరాబాద్ బయలుదేరారు. బుధవారం రాత్రి లోటస్‌పాండ్ చేరుకున్నారు. కాగా, మంగళవారం కంటే బుధవారం జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని సీనియర్ ఫిజీషియన్ పురుషోత్తమరావు చెప్పారు. పల్స్ 72, బీపీ 120/80, బ్లడ్ షుగర్ 109గా ఉందని ఆయన తెలిపారు.
అంతకుముందు ఆస్పత్రిలో జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు విజయసాయిరెడ్డి, లావు రత్తయ్య పరామర్శించారు.
ఇది ఇలా ఉండగా, ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రకటించింది. ఆ కార్యాచరణ అమలుపై జగన్ గురువారం పార్టీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు.

వైయస్ జగన్
జీజీహెచ్‌లో రెండు రోజులుగా చికిత్స పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిశ్చార్జి అయ్యారు.

వైయస్ జగన్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జగన్‌ను మంగళవారం తెల్లవారుజామున చికిత్స నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్
మిలీనియం బ్లాక్ ప్రాంగణంలోని రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను బుధవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వైద్యులు డిశ్చార్జి చేశారు.

వైయస్ జగన్
జగన్‌ను డాక్టర్లు ఇంటికి పంపంచి వేస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు గుంటూరు ఆస్పత్రి వద్దకు చేరుకుని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

వైయస్ జగన్
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన జగన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం కారులో హైదరాబాద్ బయలుదేరారు.












Click it and Unblock the Notifications