Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోషల్ మీడియా సైన్యం కోసం రంగంలోకి జగన్.. ప్రత్యేక బృందాలతో సమరం షురూ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటిమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచేందుకు రంగంలోకి దిగారు. వారికి అండగా ఉండటం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియా కార్యకర్తల కోసం రంగంలోకి జగన్
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రశ్నించేవారు ఉండరని భావించి అక్రమ కేసులు పెడుతున్నారని ఇప్పటికే పేర్కొన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని, దీని కోసం కొన్ని ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలని సూచించారు.

ys Jagan enters the field for social media army announced special teams to fight

సోషల్ మీడియా సైన్యానికి అండగా ప్రత్యేక బృందాలు
వారి తరపున పోరాటం చేయడానికి వైసిపి ఎప్పుడూ సిద్ధంగా ఉందని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇదే క్రమంలో తాజాగా అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

జిల్లాల వారీగా పార్టీ బృందాలను ప్రకటించిన జగన్
అక్రమ కేసులకు, అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడానికి, వారిని పరామర్శిస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని జగన్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఇక జిల్లాల వారీగా పార్టీ బృందాలను వైయస్ జగన్ ప్రకటించారు.

జిల్లాలవారీగా పార్టీ బృందాలు వివరాలు

శ్రీకాకుళం :సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్‌
విజయనగరం :బెల్లాని చంద్రశేఖర్, జోగారావు.
వి«శాఖపట్నం :భాగ్యలక్ష్మి, కెకె రాజు.
తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత
పశ్చిమ గోదావరి :కె.సునిల్‌కుమార్‌ యాదవ్, జయప్రకాష్‌ (జేపీ)
కృష్ణా :మొండితోక అరుణ్‌ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి

విడదల రజినితో పాటు పలువురికి కీలక బాధ్యత

గుంటూరు :విడదల రజని, డైమండ్‌ బాబు
ప్రకాశం :టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి
నెల్లూరు :రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
చిత్తూరు :గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
అనంతపురం :కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్‌
కడప :సురేష్‌బాబు, రమేష్‌యాదవ్‌
కర్నూలు :హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు).
వీరిని పార్టీ బృందాలుగా సోషల్ మీడియా కార్యకర్తల కోసం నియమించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+