జగన్ ఎన్నికల అర్దమెటిక్స్, ఇదీ లెక్క - ఫైనల్ నంబర్ ఇలా..!!

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది. గెలుపు పైన జగన్, చంద్రబాబు ధీమాగా ఉన్నారు. కానీ..రెండు పార్టీల కేడర్ లో మాత్రం భిన్నమైన అంచనాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ముందుగానే పార్టీలు తాము చేయించుకున్న సర్వేలను సర్క్యులేషన్ లోకి తెచ్చారు. అయితే, జగన్ పార్టీ ముఖ్యులతో తన అంచనాలపైన స్పష్టత ఇచ్చారు. ఇందుకు కారణాలను వెల్లడించారు. జగన్ అర్డమెటిక్స్ మాత్రం ఉత్కంఠ పెంచుతున్నాయి.

గెలుపు పైన ధీమా
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో గెలుపు పైన ధీమాగా ఉన్నారు. పులివెందులలో ఓటు వేసి తాడేపల్లికి చేరుకున్న జగన్ పూర్తిగా పోలింగ్ సరళి పైన ఫోకస్ చేసారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోలింగ్ వివరాలను సేకరించారు. ఎక్కడ ఏ వర్గం ఓట్లు ఎలా పోల్ అయ్యాయనే అంశానికి అనుగుణంగా గెలుపు లెక్క పైన కసరత్తు చేసారు. ఆ తరువాత ఐప్యాక్ సమావేశంలో వైసీపీ 2019 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఎంపీ సీట్లు 22 దాటుతాయని విశ్వాసం వ్యక్తం చేసారు. కానీ, ఈ నంబర్ పైన వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలోని దీని పైన చర్చ సాగుతోంది.

YS Jagan Explains his Calculations wit hparty leaders over Poll trneds and his predictions see deets

క్షేత్ర స్థాయి సమాచారంతో
జగన్ పోలింగ్ రోజున పక్కా సమాచారం కోసం అయిదు సర్వే సంస్థలతో పాటుగా మరో రెండు మార్గాల ద్వారా పూర్తి లెక్కలు సేకరించారు. అన్ని నివేదికలను కూలంకషంగా చర్చించి..ఫైనల్ గా నిర్దారణకు వచ్చారు. అయితే..పోలింగ్ సరళి చూసిన వారు మాత్రం ఈ స్థాయిలో ఏకపక్ష ఫలితం సాధ్యమేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ ముఖ్యలతో మాట్లాడారు. తాను చెప్పిన నెంబర్ రాబోతోందని మరోసారి స్పష్టం చేసారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా..అసలు ఫలితం ఇదేనని ధీమాగా చెబుతున్నారు. జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్, మహిళా - గ్రామీణ ఓటింగ్ పూర్తిగా కలిసి వచ్చిందని జగన్ తన అంచనాగా విశ్లేషిస్తున్నారు.

అధికారం ఖాయమంటూ
జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు మాత్రం తాము ఖచ్చితంగా 110 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా 150కి పైగా గెలుస్తామని చెప్పటానికి వైసీపీ నేతలు సాహసించటం లేదు. మహిళా ఓటింగ్ మెజార్టీ తమకే పోల్ అయిందని లెక్కలు చెబుతున్నారు. అదే విధంగా పెరిగిన పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ ఓట్ పోల్ అయిందని లెక్కలు చెబుతున్నారు. అదే విధంగా పథకాల లబ్దిదారులు పూర్తిగా జగన్ ను విశ్వసించారని వివరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ చెబుతున్న అంకె 150 ఉండగా..పార్టీ ముఖ్యులు మాత్రం 110కి పైగా స్థానాలు వస్తాయని తమ అంచనాగా వెల్లడిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+