ఎన్నికల ఓటమి తర్వాత జగన్ తొలి విజయం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల ఓటమి తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనేదానిపైన అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్ కు తాజాగా కర్తవ్యం బోధపడినట్టు అయింది. ఢిల్లీ లో జగన్ ధర్నా ఆయనకు మార్గం చూపించింది.
జగన్ కు దిశా నిర్దేశం చేసిన ఢిల్లీ ధర్నా
వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న దారుణాల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా పూరించిన సమర శంఖం జగన్ కు దిశా నిర్దేశం చేసింది. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వైయస్ జగన్ ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లారు.

ఓటమి తర్వాత జగన్ తొలివిజయం
పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన వైయస్ జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో తొమ్మిది రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్ కు అండగా నిలవడం ఆయనను ఓటమి తర్వాత తొలిసారి సంతోషానికి గురిచేసింది. ఢిల్లీ వేదికగా జగన్ నిర్వహించిన ధర్నా సక్సెస్ కావడం ఎన్నికల ఓటమి తర్వాత జగన్ సాధించిన తొలి విజయం.
ధర్నాతో నెరవేరిన జగన్ రెండు లక్ష్యాలు
ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించిన జగన్ తాను నిర్వహించిన ధర్నా ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, ఏపీ పాలనను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ తెలియజేశారు. ఇదే సమయంలో ఊహించని విధంగా 9 రాజకీయ పార్టీల మద్దతు జగన్ కు లభించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదిపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం దేశం దృష్టిని ఆకర్షించింది.
జగన్ కు కొత్త ఆలోచనలు ఇచ్చిన ధర్నా
అన్నాడీఎంకే మినహాయించి ఇండికూటమి లోని పార్టీలు జగన్ కు మద్దతు తెలపడం జగన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ తాజా ఢిల్లీ ధర్నా జగన్ కు కొత్త ఆలోచనలు ఇస్తుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
ఢిల్లీలో ఆ పనితో సూపర్ సక్సెస్ అయిన జగన్
ఇక తాజా పరిణామాలతో జగన్ ఏదైనా జాతీయ కూటమిలో చేరుతారా లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కొత్త శక్తిగా తయారవుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికల తర్వాత ఢిల్లీ వేదికగా జగన్ మొదటిసారి ధర్నా చేసి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇది ఆయనకు ఎన్నికల ఓటమి తర్వాత సంతోషాన్ని, కొత్త ఆలోచనలు ఇచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications