జమ్మలమడుగులో ఆది పై వైసీపీ అభ్యర్ధి ఫిక్స్- జగన్ అనూహ్య ఎంపిక..!!

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం కూటమి - వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లను ఖరారు చేస్తున్నారు. నియోజకవర్గాల పై ఫోకస్ చేసిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తన సొంత జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు పైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్ధి ఎవరో తేల్చేసారు. కొత్తగా నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం జిల్లాలో సంచలనంగా మారుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల దిశగా ముందస్తు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులను ముందస్తుగానే ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంఛార్జ్ ల పేరుతో నియోజక వర్గాల్లో బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి సామాజిక - స్థానిక లెక్కల ఆధారంగా కొన్ని చోట్ల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే కేడర్ తో పాటుగా ప్రజలతో మమేకం అయ్యేలా వారికి సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా తన సొంత జిల్లా జమ్మలమడుగు పైన జగన్ ఫోకస్ చేసారు. అక్కడ 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. దీంతో, తిరిగి ఆ నియోజకవర్గం దక్కించుకోవటం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

ys-jagan-fixed-to-field-former-minister-from-jammalamaudugu-for-next-election

దీంతో.. అక్కడ ఇప్పటి వరకు ఇంఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో.. జమ్మల మడుగు వైసీపీ ఇంఛార్జ్ గా మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. జమ్మలమడుగులో తొలి నుంచి ఆది ఫ్యామిలీ.. రామ సుబ్బారెడ్డి వర్గాల మధ్య రాజకీయ వైరం ఉంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తరువాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో.. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి కంటే రామసుబ్బారెడ్డి సేవలు అవసరమని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. 1994,1999లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గెలిచిన రామసుబ్బా రెడ్డి తొలుత ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు.

కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఫలితాలను ఎదుర్కొంది. ప్రస్తుతం బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని చెబుతున్నారు. కాగా, ఆ రోజు ఉండే పొత్తులు కీలకంగా మారనున్నాయి. అయితే.. జమ్మలమడుగులో మాత్రం ఆది - రామ సుబ్బారెడ్డి మధ్య పోటా పోటీ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ముందస్తుగానే రామ సుబ్బారెడ్డిని ఇంఛార్జ్ గా నియమించటం ద్వారా ప్రయోజనం ఉంటుందని జగన్ భావించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇక, జమ్మలమడుగు కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+