ఏపీలో మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్...
ఏపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. సాధారణ ఉద్యోగులతో సమానంగా ఓ విషయంలో తమకూ న్యాయం చేయాలని వారు కోరుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారికి కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనం చేకూరనుంది.
ఏపీలో ప్రభుత్వం మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయాలని గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే. తాత్కాలిక ప్రాతిపదిక నియమించిన వారికి ఇది వర్తించదు. దీంతో ఈ సౌకర్యాన్ని ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున ముఖ్యమంత్రి జగన్ కు వినతులు వెళ్లాయి.

దీనిపై స్పందించిన సీఎం జగన్.. ఈ విజ్ఞప్తిని మన్నించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంవత్సరానికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయడానికి అంగీకరించారు. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 39 తేదీ. 11-04-2023 ద్వారా ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిన సీఎం జగన్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications