Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YS Jagan : ఆదాయం ఎలా తీసుకురావాలో అధికారులకు చెప్పిన వైఎస్ జగన్..

ఏపీలో ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న శాఖలపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న శాఖలు, వాటి పనితీరు, వనరుల లభ్యత, అవకాశాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. అలాగే ఆదాయార్జనకు ఉన్న అవకాశాలు కూడా చర్చించారు.

ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ చేసిన సమీక్షలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకూ జీఎస్టీ (పరిహారం కాకుండా) పన్నుల వసూళ్లు 91 శాతం లక్షం చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ వరకూ రూ.7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గతేడాదితో పోలిస్తే ఇదే కాలంలో 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందన్నారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గి, ఆదాయం పెరిగిందన్నారు.

ys jagan guide officials on how to get revenue to state exchequer..

నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలన్నారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సీఎం సూచించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు.

గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు సీఎంకు వెల్లడించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రీ సర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయన్నారు. దాదాపు 5వేల రిజిస్ట్రేషన్‌ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయన్నారు. వీటిద్వారా రూ.8.03 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

ys jagan guide officials on how to get revenue to state exchequer..

అలాగే గనులు, ఖనిజాల శాఖ నుంచి గత మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని, 2018-19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022-23 నాటికి రూ.4,756 కోట్లకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్‌ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని తెలిపారు.మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దీనిపై స్పందించిన సీఎం.. గతంలో గనులు, ఖనిజాల శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందన్నారు.రవాణారంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలన్నారు.అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.

ys jagan guide officials on how to get revenue to state exchequer..

వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం జగన్ సూచించారు. ఇవి కొనుగోలు దారులకు ప్రోత్సహించేలా ఉండాలన్నారు. అలాగే ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు, జిల్లాకలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు.క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలన్నారు. దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయని, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+