కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వేళ జగన్ అనూహ్య స్పందన, కంగ్రాట్స్..!!

కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వేళ జగన్ స్పందించారు. అభినందనలు తెలిపారు. తమ హయాంలో ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించామని గుర్తు చేసారు. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతమైన నిరంతర ప్రక్రియ. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ఇప్పటికే జరిగిన పనిని కొనసాగిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో ఇది ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు. ఈ మేరకు జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కాగా, ఈ పనుల ప్రారంభం పైన స్పందించిన మాజీ సీఎం జగన్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. సజ్జన్ జిందాల్. JSW స్టీల్ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

YS Jagan Hails Restart of JSW Steel Plant Project in Kadapa as Major Boost for Rayalaseema

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో ఇది ఒక కీలక ఘట్టంగా పేర్కొన్న జగన్.. ఉపాధి మరియు ఆర్థిక వృద్ధిని ఆశిస్తున్న యువతకు, కుటుంబాలకు ఇది ఒక ఆశాకిరణంగా అభివర్ణించారు. ఇటువంటి భారీ ప్రాజెక్టుల వెనుక ఏళ్ల తరబడి సాగిన అంకితభావంతో కూడిన కృషి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే JSWను ప్రాజెక్ట్ డెవలపర్‌గా ఖరారు చేసి, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి అవసరమైన కీలక పునాదులను వేసామని గుర్తు చేసారు.

 వైసీపీలోకి నాటి జెయింట్ కిల్లర్ రీ ఎంట్రీ, అదే బాటలో మాజీ మంత్రి..!?
వైసీపీలోకి నాటి జెయింట్ కిల్లర్ రీ ఎంట్రీ, అదే బాటలో మాజీ మంత్రి..!?

స్టీల్ ప్లాంట్ అనుమతులు సాధించటంతో

పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూమి కేటాయింపు, రహదారి సౌకర్యాలు .. అనుబంధ మౌలిక సదుపాయాలకు అవసరమైన భూమిని సమకూర్చడంతో పాటు, ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి అవసరమైన అన్ని కీలక అనుమతులను సాధించామని వివరించారు. ఆ పునాదుల కారణంగానే, తమ హయాంలో ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగాయని చెప్పుకొచ్చారు . దురదృష్టవశాత్తు, గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి, దీనివల్ల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ పెట్టుబడి ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు.

ఇప్పుడు పనులు తిరిగి ప్రారంభం కావడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. కడప ప్రజలు చాలా కాలంగా వేచి చూస్తున్నారని.. ఎటువంటి జాప్యం లేకుండా ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చూడటం వారి హక్కని చెప్పుకొచ్చారు.ఈ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడంలోనూ, అలాగే ఉపాధి, పారిశ్రామిక వృద్ధి మరియు సమగ్ర అభివృద్ధి ద్వారా కడప ప్రజలు మరియు రాయలసీమ ప్రాంతం మొత్తం ప్రయోజనం పొందేలా చేయడంలోనూ JSW సంస్థకు లభించాలని తాను కోరుకుంటు న్నట్లుగా జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+