YS Jagan: వైఎస్ జగన్ లో ఉన్న ప్రత్యేక లక్షణం ఇదే..
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..ఆయనలో ఒక మంచి గొప్ప లక్షణం ఉంది. ఆ గొప్ప లక్షణమే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆసక్తిని కలిగిస్తుంది. అసలు ఇంతకీ వైయస్ జగన్ లో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి? ఎందుకు ఆయన గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నాము అంటే..
తాజాగా జగన్ వ్యాఖ్యలు
తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారి గురించి చేసిన వ్యాఖ్యలే ఆయనలో ఉన్న గొప్ప లక్షణానికి నిదర్శనం. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వారు వెళ్ళిపోవచ్చు అని తాను ఎవరిని బ్రతిమాలబోనని, వెళ్లిపోవాలనుకుంటే ఎప్పుడైనా వెళ్లవచ్చని పార్టీ నేతలకు చాలా లిబర్టీ ఇచ్చారు.

ఎవరినీ ఆపబోనన్న జగన్
వెళ్లిపోయే వారి గురించి చెబితే నేనేం చేస్తాను అంటూ పేర్కొన్న ఆయన, నేను ఆపితే మాత్రం ఉంటారా.. ఇక్కడొక కాలు అక్కడొక కాలు ఎందుకు.. వెళ్లే వాళ్ళు ఎంతటి వారైనా సరే నేను ఆపను.. వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ... చేసిన వ్యాఖ్యలే వైయస్ జగన్ లోని గొప్ప లక్షణాన్ని చెబుతున్నాయి.
ఇతర రాజకీయ నాయకులకు జగన్ కు ఉన్న తేడా ఇదే
సహజంగా ఎక్కడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుండి నేతలు వెళ్ళిపోతుంటే అధినేతలు నేతలను ఆపే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు వారిని పిలిచి మాట్లాడి పార్టీలోనే ఉండేలా బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్ళిపోయే వాళ్ళందరినీ వెళ్లిపోమంటూ చెప్పడం, ప్రజలు తమకు మద్దతుగా ఉంటారని చెప్పడం జగన్ లోని గొప్ప లక్షణం.
ఒంటరిగా పార్టీని ప్రారంభించిన జగన్
పార్టీని ప్రారంభించిన నాడు తాను తన తల్లి మాత్రమే పార్టీని ప్రారంభించామని గుర్తు చేసిన జగన్ తాను పార్టీని ప్రారంభించిన నాడు ఎవరూ లేరని ఆ తర్వాత అందరూ వచ్చారని ఇప్పుడు వీళ్లు వెళ్లిపోతే కూడా తన పార్టీ ఆగిపోదని చెప్పే ప్రయత్నం చేశారు, అధికారంలో లేకపోయినా, టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా, పార్టీ నుంచి నేతలు వలసలబాట పట్టిన జగన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయనలోని గొప్ప లక్షణం అని చెప్పాలి.
ఎవరు లేకున్నా పార్టీని ముందుకు నడిపిస్తానన్న జగన్
రాజకీయాలలో ఒడిదుడుకులు సహజమని, గెలుపోటములు సహజమని ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఓటమి బాధతో కృంగిపోకుండా పార్టీని ముందుకు నడిపిస్తామని జగన్ చెప్పారు. ఇక వైసిపి నేతలు వరుస షాకులు ఇస్తున్నా తనదైన పందాలో పార్టీని ముందుకు నడిపించేందుకు జగన్ సిద్ధమయ్యారు. పోరాటం తనకు కొత్తేమీ కాదని చెప్పిన జగన్ మళ్లీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఇదే వైయస్ జగన్ లో ఉన్న గొప్ప లక్షణం అని వైసిపి అభిమానులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ని చూసి చాలామంది రాజకీయ నాయకులు నేర్చుకోవలసిన విషయం ఇదేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications