రపా.. రపా.. ప్లకార్డ్ పై జగన్ పంచ్ లు..! అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినా..!

ఏపీలో నిన్న జరిగిన వైఎస్ జగన్ పల్నాడు టూర్ లో రపా రపా డైలాగ్ తో కూడిన ప్లకార్డ్ కలకలం రేపింది. వైసీపీ కార్యకర్తగా భావిస్తున్న ఓ వ్యక్తి వైసీపీ 2029లో అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో పోలీసులు ఇవాళ సదరు కార్యకర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రపా రపా తలలు నరుకుతాం అంటూ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పై స్పందిస్తూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో డైలాగ్ ప్లకార్డు పట్టుకున్నా తప్పేనా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అతను టీడీపీకి చెందిన వ్యక్తేనని, ఆ పార్టీ సభ్యత్వం ఉందని తెలుసుకుని.. తన పార్టీ అధినేత చంద్రబాబు తప్పుల్ని తట్టుకోలేక అతను ఇలా సొంత పార్టీ వారినే ఇలా రపా రపా నరుకుతానని చెప్తున్నాడేమో అంటూ ఛలోక్తులు విసిరారు.

ys jagan hilarious punches on rapa rapa placard dialogue in palnadu tour drags allu arjun

తన పర్యటనలకు జనం భారీగా తరలి వస్తుండటంపైనా జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పులకు ఆయన మీద కోపంతో జనం రావట్లేదేమో కానీ తనపై అభిమానంతో జనం భారీగా వస్తున్నారని తెలిపారు. దీన్ని శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వం చూపించి తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని జగన్ ఆక్షేపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాగ్రహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+